Begin typing your search above and press return to search.

వైసీపీలో అయితే ర‌గ‌డ‌... లేక‌పోతే సైలెంట్‌..!

By:  Tupaki Desk   |   23 Jan 2022 1:47 PM GMT
వైసీపీలో అయితే ర‌గ‌డ‌... లేక‌పోతే సైలెంట్‌..!
X
ఏపీలోని అధికార పార్టీ నేత‌ల తీరు ఇలానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ర‌గ‌డ‌, లేకుంటే ..సైలెంట్ అనే మాటే వినిపిస్తుండ‌డంతో అస‌లు వైసీపీ నేత‌ల మ‌ధ్య క‌లివిడి రాజ‌కీయాలు క‌నిపించ‌డం లేదు. నిజానికి అధికార పార్టీ నేత‌లు అంటే.. క‌లివిడిగా ఉంటూ.. ప్ర‌భుత్వ వాయిస్‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలి. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల‌పై ఖ‌చ్చితంగా దూకుడు ప్ర‌ద‌ర్శించాలి. ఇది పొరుగు రాష్ట్రం లో క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో అధికార‌పార్టీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు కీచులాడుకుంటున్న పరిస్తితి క‌నిపించ డం లేదు.

పైగా.. ఏదైనా విష‌యం వ‌స్తే.. నాయ‌కులు అంద‌రూ క‌లివిడిగా పోరుకురెడీ అంటున్నారు. మ‌రీ ముఖ్యంగా.. ప్ర‌బుత్వ అనుకూల వాద‌న‌ను వినిపించ‌డంలో నాయ‌కులు ముందున్నారు. అయితే.. దీనికి భిన్నంగా ఏపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌డం లేదు. ఇక‌, మంత్రుల దారి మంత్రుల‌దే! అన్న‌ట్టు గా ఉంది ప‌రిస్తితి. దీంతో రాష్ట్రంలో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేద‌నే వాద‌న వ‌స్తోం ది. ఏజిల్లాను తీసుకున్నా.. ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఎమ్మెల్యే వివాదాలు క‌నిపిస్తున్నాయి. అనంత‌పురం నుంచి సిక్కోలు వ‌ర‌కు ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

త‌మ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో వేలు పెడుతున్న ఎంపీ త‌మ‌కు క‌నీసం స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని.. ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. త‌మ‌పై పెత్త‌నం చేసేందుకు.. ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ఎంపీలు.. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణలు చేసుకుంటున్నారు. అయితే.. త‌మ‌కు న‌చ్చ‌నిఎమ్మెల్యేను మార్చేందుకు.. త‌మ‌కు అనుకూల‌మైన నాయ‌కుడికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇప్పించుకునేందుకు ఎంపీలు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అనంత‌పురంలో కేతిరెడ్డి వ‌ర్సెస్ త‌లారి రంగ‌య్య‌ల మ‌ధ్య వివాదాలు ఇలానే సాగుతున్నాయి.

ఇక‌, గుంటూరులోనూ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య వివాదాలు సాగుతున్నాయి. రాజ‌మండ్రిలోనూ ఇలానే క‌నిపిస్తోంది. విశాఖ‌లో వివాదాలు ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రికి వారు రాజ‌కీయం చేసుకుంటున్నారు. త‌ప్ప రోడ్డున ప‌డ‌డం లేదు. ఒక్క విప‌క్ష ఎంపీలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్ల‌మెంటు నియొజ‌క‌వ‌ర్గాల్లో త‌ప్పితే.. వైసీపీ నాయ‌కులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్ల‌మెంటు స్థానాల్లో మాత్రం వివాదాలు కొన‌సాగుతున్నాయి. అయితే.. వీటిలో.. కాకినాడ‌, మ‌చిలీప‌ట్నం వంటి ఒక‌టి రెండు మాత్ర‌మే మిన‌హాయింపు. మ‌రి ఇలా అయితే.. పార్టీ ప‌రిస్తితి ఏంటి? అనేది చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం.