Begin typing your search above and press return to search.

మెడిక‌ల్ రిప్ర‌జెంటేట‌ర్లుగా మారిన ఎమ్మెల్యేలు.. వైసీపీలో గుస‌గుస‌!

By:  Tupaki Desk   |   26 Aug 2022 12:30 AM GMT
మెడిక‌ల్ రిప్ర‌జెంటేట‌ర్లుగా మారిన ఎమ్మెల్యేలు.. వైసీపీలో గుస‌గుస‌!
X
వైసీపీలో అధిష్టానం అనుస‌రిస్తున్న విధానాల‌పై ఆ పార్టీ నాయ‌కులు .. తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌నే వార్త‌లు కొన్నాళ్లుగా వ‌స్తున్నాయి. అయితే.. ఈ విష‌యంలో అధిష్టానం మాత్రం త‌ప్పుమీదే అంటూ.. నేత‌ల‌పై ఎదురు దాడి చేస్తోంది. మేం ప్ర‌జ‌ల్లో ఉండ‌మ‌న్నా ఉండ‌డం లేదు.. వారి స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల తీరును వివరించ‌డం లేదు.. అని వైసీపీ అధిష్టానం చెబుతోంది. కానీ, నాయ‌కులు మాత్రం మాకు నిధులు ఇవ్వ‌డం లేద.. దీంతో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు ఎలా వెళ్తాం.. అని చెబుతూ వ‌చ్చారు.

అయిన‌ప్ప‌టికీ.. మీరు వెళ్లాల్సిందే. అభివృద్ధి మాట‌కు మాకు వ‌దిలేయండి.. మీరు కేవ‌లం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టింది. అలా అయితేనే టికెట్లు ఇస్తామ‌ని.. స్ప‌ష్టం చేసింది.

అప్పుడు కూడా స‌ర్వేలు చేయించి.. మార్కులు ప‌డిన వారికే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపింది. అయితే.. దీనిపై ఎమ్మెల్యేలు ముందు ఓకే అన్నారు. అయితే.. క్షేత్ర‌స్థాయిలోకి వెళ్లాక కానీ.. వారికి విష‌యం బోధ‌ప‌డలేదు.

ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌ల నుంచి రోడ్లు.. కాలువ‌లు.. పింఛ‌న్లు, ఇళ్లు.. ఇలా.. అనేక స‌మ‌స్య‌ల‌కు తోడు.. వ‌ర్గ పోరు కూడా ఎమ్మెల్యేల‌కు సెగ పెడుతోంది. వాస్తవానికి.. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మంది ఉన్న‌త విద్య చ‌దివిన వారు ఉన్నారు. డాక్ల‌ర్లు, ఇంజ‌నీర్లు.. ఐఐటీ చేసిన వారు.. లాయ‌ర్లు కూడా ఉన్నారు. ఈ విష‌యం చాలా త‌క్కువ మందికే తెలుసు. వృత్తిగ‌తంగా వారు రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. ఇప్ప‌టికీ.. వారు ఎక్క‌డైనా త‌మ పేరు చెప్పుకొంటే.. డాక్ట‌ర్ అనో.. లాయ‌ర్ అనో చెప్పుకొంటారు.

ఇలాంటి వారు.. ఇప్పుడు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ప‌థ‌కాలు వివ‌రించాల్సిరావ‌డంపై.. మొదట్లో పెద్ద‌గా ప‌ట్టిం చుకోలేదు... కానీ.. త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు తిట్లు రావ‌డంతో.. ఇంత చ‌దువుకుని.. ఇంత ఖ‌ర్చు పెట్టి ఎమ్మెల్యే అయింది.. తాము తిట్లు తిన‌డానికేనా? అస‌లు.. తాము మెడిక‌ల్ రిప్ర‌జెంటేట‌ర్ల మాదిరిగా మారిపోయామా?

ప్ర‌భుత్వానికి ప్రొమోష‌న్ ఇవ్వ‌డానికి అనే ఆలోచ‌న మెద‌లింది. దీంతో ఇప్పుడు చాలా మంది త‌మ అనుచ‌రుల‌ను పంపిస్తున్నారు.. త‌ప్పు తాము బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఈ ప‌రిణామం.. వైసీపీలో పెద్ద ఎత్తున ఇబ్బందిగా మారింద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. మ‌రి అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.