Begin typing your search above and press return to search.
టీడీపీ చీలిపోతుందా...బీజేపీ ముక్కలవుతుందా?
By: Tupaki Desk | 21 May 2019 5:40 PM GMTసార్వత్రిక ఎన్నికల ఫలితాల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో మాటల యుద్ధం జరుగుతోంది. ఫలితాల కంటే ముందే ఆయా పార్టీలు తమ ప్రత్యర్థులను ఓటమి ఖాయమని ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. దీంతో పాటుగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ... నారా టీడీపీ..నందమూరి టీడీపీగా చీలిపోతుందంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు కౌంటర్ ఇచ్చారు.
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ పార్టీ రెండుగా చీలిపోనుందని.. నారా పార్టీ - నందమూరి పార్టీగా విడిపోనుందని జోస్యం చెప్పారు. బాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఈసీపై అనవసరంగా ఆయన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈసీపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. తనపైన ఏ తప్పులు పడకుండా.. పక్కవారిని దొంగలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మాధవ్ ధ్వజమెత్తారు. తమకు, వైసీపీ మధ్య కూడా చంద్రబాబు లింక్‌లు పెట్టారని.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ కలిసి ఎక్కడా పోటీ చేసిన దాఖలు కూడా లేవని ఆయన అన్నారు. ఏపీలోని అన్ని వ్యవస్థలను బాబు నిర్వీర్యం చేశారని మాధవ్ ఆరోపణలు చేశారు.
బీజేపీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలకు అమరావతిలో మీడియాతో మాట్లాడిన అశోక్ బాబు టీడీపీ రెండుగా చీలిపోతుందంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దీని వెనుక ఏదైనా కుట్ర జరుగుతోందా? అనే అనుమానం కలుగుతోందని అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. బీజేపీ రెండుగా చీలిపోతుందేమో చూసుకోండి! అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోననేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ, ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అశోక్ బాబు ఆరోపించారు. చంద్రబాబు నేతృత్వంలో 21 విపక్ష పార్టీలు మోడీకి నియంతృత్వ విధానాలు, ఈసీ ఏకపక్ష వైఖరిపై పోరాటం చేస్తున్నాయని ఆయన తెలిపారు.