Begin typing your search above and press return to search.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్ టిక్కెట్ల గోల
By: Tupaki Desk | 27 Nov 2015 5:37 AM GMTతెలంగాణలో పన్నెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు తీవ్రం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరికి హామీలు లభించినవారు ఆ హామీలను ఖాయం చేసుకునే పనిలో పడ్డారు.
అయితే... ఇతర పార్టీల నుంచి వచ్చి టిఆర్ ఎస్ లో చేరి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినవారికి ఎక్కువగా టిక్కెట్లు అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వారిలో టి.భాను ప్రసాద్(కరీంనగర్) - జగదీశ్వర్ రెడ్డి ( మహబూబ్ నగర్) - నరేంద్ర రెడ్డి (రంగారెడ్డి) - కె.భూపాల్ రెడ్డి (మెదక్) - బి.లక్ష్మీనారాయణ (ఖమ్మం)లకు అవకాశం వస్తుందని టీఆరెస్ వర్గాలు చెప్తున్నాయి. వీరంతా ఆకర్షణ మంత్రంలో భాగంగా టీఆరెస్ లో చేరిన నేతలే.
కాగా టీఆరెస్ పార్టీలో ఉన్నవారిలో నారదాసు లక్ష్మణరావు(కరీంనగర్ ) - డాక్టర్ భూపతి రెడ్డి (నిజామాబాద్ ) - పురాణం సతీష్(ఆదిలాబాద్ )లకు టిక్కెట్లు దక్కవచ్చని పేర్కొంటున్నారు. మరోవైపు కొండా మురళీ కూడా వరంగల్ నుంచి ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. ఆయనకు ఇస్తారా లేక కిందటిసారి ఎంపీ టిక్కెట్ మిస్సయిన రవికుమార్ కు ఇస్తారా అన్నది ఆసక్తికరంగా ఉంది. రంగారెడ్డి జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన శంబీర్ పూర్ రాజుకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆయనకు ఢోకాలేదని చెబుతున్నారు.