Begin typing your search above and press return to search.
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్: ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థులు
By: Tupaki Desk | 20 March 2021 4:55 AM GMTతెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలు ఆదివారం జరిగాయి. బుధవారం మొదలుపెట్టిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.
శనివారం నాలుగో రోజు కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానం ఓట్ల లెక్కింపును హైదరాబాద్ లోని ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఇక వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానం ఓట్ల లెక్కింపును నల్లగొండలోని ఆర్జాలబావి గిడ్డంగుల సంస్థ గోదాంలో లెక్కిస్తున్నారు..
ఈ ఓట్ల లెక్కింపు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ 51శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యతలోనూ ఎవ్వరికి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఒకవేల ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. జంబో బ్యాలెట్ తో కౌంటింగ్ సవాల్ గా మారింది. మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి ఇప్పటివరకు 1,15,043 ఓట్లు సాధించగా.. బీజేపీ అభ్యర్థి రాంచంద్రారావు 1,06,565 ఓట్లుసాధించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ 55742 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 32879 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యతలో 86మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి 8478 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మరో వైపు నల్గొండ-ఖమ్మం -వరంగల్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,17,386 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 91,858 ఓట్లు, కోదండరాంకు 79110 ఓట్లు వచ్చాయి. పల్లా 25528 ఓట్లతో లీడ్ లో ఉన్నారు. బీజేపీ ప్రేమేందర్ 41328 ఓట్లు , కాంగ్రెస్ రాములు నాయక్ 29441 ఓట్లు పోలయ్యాయి.