Begin typing your search above and press return to search.
తిప్పికొట్టారంటూనే కలవరమేల.. కవితక్కా!!
By: Tupaki Desk | 22 Dec 2022 12:30 PM GMTతెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటుందని.. పుంజుకోవాలని.. ఆ పార్టీ అధినేత,మాజీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్లు రాజకీయంగా దుమ్ము రేపుతున్నాయి. పైగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించిన మహాసభకు తండోపతండాలుగా జనం తరలి వచ్చారు. దీంతో చంద్రబాబు ఒకింత వ్యూహాత్మకంగానే మాట్లాడారు. పార్టీ పుంజుకోవాలని.. పార్టీ నుంచి దూరమైన వారు రావాలని ఆయనపిలుపునిచ్చారు.
అయితే..చంద్రబాబు వ్యాఖ్యలపై ఉలిక్కి పడ్డారో ఏమో.. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. కలవరపడే వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ఎమ్మెల్సీ కవిత కొన్ని కామెంట్లు చేశారు. చుక్కలు ఎన్ని ఉన్నా `చంద్రుడు` ఒక్కడే అన్నారు. అంతేకాదు.. ఆ చంద్రుడు `కేసీఆర్ `ఒక్కడే అని నొక్కి చెప్పారు. అంతేకాదు.. టీడీపీ రాజకీయాలు తెలంగాణలో చెల్లవని చెప్పారు.
చంద్ర బాబు వచ్చి మళ్లి ఇక్కడ పార్టీ ని రివైవ్ చేయాలి అనుకుంటున్నారని కవిత వ్యాఖ్యానించారు. ``వాళ్లు(టీడీపీ-ఏపీ వాళ్లు) తెలంగాణ బాగును కోరిన వాళ్ళు కాదు`` అని చెప్పారు. వాళ్ళను తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేసారని కవిత తీర్మానం చేశారు. ఇప్పుడు వచ్చి రాజకీయం చేద్దాం అనుకున్నా మళ్లి రిజెక్ట్ చేస్తారు. అని కవిత వ్యాఖ్యానించారు.
అయితే.. ఇక్కడ కీలక విషయం ఏంటంటే.. తిప్పికొట్టారని కవిత చెబుతున్న పార్టీ సభ పెడితే.. తండోపతండాలుగా జనం ఎందుకు వచ్చారు? ఆమె ఈ తిప్పికొట్టిన పార్టీకి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? చంద్రుడు కేసీఆర్ అన్నప్పుడు అసలు ఈ కలవరపాటు ఎందుకు? అనేది పరిశీలకుల ప్రశ్న. ఏదేమైనా.. కొంత ఫ్రెస్టేషన్‌లో ఉన్న కవిత.. ఏదో మాట్లాడాలని మాట్లాడడమేనని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.