Begin typing your search above and press return to search.
ఎమ్మెల్సీ కవితకు టీకా.. అదెలా సాధ్యమైంది?
By: Tupaki Desk | 30 March 2021 4:30 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత తాజాగా వ్యాక్సిన్ వేసుకోవటం తెలిసిందే. ఇటీవల ఆమె భర్త కరోనా పాజిటివ్ గా తేలటం తెలిసిందే. తమను ఎవరూ కలవొద్దంటూ కొద్దిరోజుల క్రితం ట్వీట్ చేసిన ఆమె.. తాజాగా నిమ్స్ లో టీకా వేయించుకున్నారు. అధికారికంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో టీకా వేయించుకున్న మొదటి వ్యక్తి కిందకు కవిత వస్తారు. ఇప్పటివరకున్న నిబంధనల ప్రకారం 45 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే టీకా వేయాల్సి ఉంటుంది. అది కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి మాత్రమే.
ఒకవేళ వయసుతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలంటే కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్ అయి ఉండాలి. ఎమ్మెల్సీ కవిత ఆ కోవలోకి రారు. ఏప్రిల్ ఒకటి నుంచి వస్తున్న నిబంధన ప్రకారం 45 ఏళ్లు ఉన్న వారు ఎవరైనా సరే వ్యాక్సిన్ వేయించుకునేందుకు అవకాశం ఉంది. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. కేంద్రం వ్యాక్సిన్ విషయంలో ఈ వెసులుబాటు కల్పించింది. గూగుల్ చెబుతున్న లెక్క ప్రకారం ఎమ్మెల్సీ కవిత వయసు 43 సంవత్సరాలు మాత్రమే.
ఇలా ఏ రీతిలో చూసినా.. కవితకు వ్యాక్సిన్ ఎలా వేశారన్నది ప్రశ్నగా కొందరు లేవనెత్తుతున్నారు. అయితే.. కవితకు టీకాను ప్రజాప్రతినిధుల కోటాలో వేసినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే.. హైరిస్కు వర్గాల్లో ప్రజాప్రతినిధులు కూడా ఉంటారని.. నిత్యం వారిని వందల మంది కలుస్తుంటారని.. అందుకే ప్రజాప్రతినిధులకు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెబుతున్నారు. ఆసక్తికరంగా ప్రజాప్రతినిధులు ఈ అవకాశాన్ని పెద్దగా వినియోగించుకున్నట్లుగా కనిపించదు.
ఎమ్మెల్సీ కవిత వ్యాక్సిన్ వేయించుకున్న వైనంపై ఆసక్తికర చర్చ నడుస్తుంటే.. మరోవైపు కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కమ్ రాజ్యసభ సభ్యుడైన సంతోష్ కూడా హోలీ రోజునే వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇంతకాలం వ్యాక్సిన్ వేయించుకునే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించని కేసీఆర్ కుటుంబ సభ్యులు.. ఇప్పుడు మాత్రం ఒకే రోజు ఇద్దరు వ్యాక్సిన్ వేయించుకోవటం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ సీఎం కేసీఆర్ ఎప్పుడు వేయించుకుంటారన్నది ప్రశ్న. ఎందుకంటే.. ఆయనకు సూదిమందు అంటే అస్సలు ఇష్టముండదు. అవసరమైతే దేనికైనా సిద్ధమంటారు కానీ.. సూదిమందుకు మాత్రం వెనుకాడతారు. అందుకే.. కేసీఆర్ టీకా మాట ఆసక్తికర చర్చకు తెర తీస్తుంటుంది.