Begin typing your search above and press return to search.

చంద్రబాబుకే షరతులు పెడతున్న మాజీ ఎంపీ

By:  Tupaki Desk   |   27 July 2018 8:23 AM GMT
చంద్రబాబుకే షరతులు పెడతున్న మాజీ ఎంపీ
X
ఒంగోలు లోక్ సభా స్థానంలో వైసీపీ బలంగా ఉండడంతో అక్కడ ఆర్థికంగా బాగా బలమైన అభ్యర్థిని తెలుగుదేశం తరఫున నిలపాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని చాలాకాలంగా దువ్వుతున్నారు. ఆయన్ను అక్కడ పోటీలో దించితే పార్టీ ఖజానా నుంచి ఒక్క పైసా కూడా తీయనవసరం లేదని.. ఒంగోలు పార్లమెంటు సీటు - ఆ జిల్లాలోని అసెంబ్లీ సీట్ల ఎన్నికల ఖర్చంతా శ్రీనువాసుల రెడ్డే చూసుకుంటారన్నది చంద్రబాబు ప్లాన్. దానికి శ్రీనివాసుల రెడ్డి నుంచి అభ్యంతరమేమీ రాలేదట.. కానీ... తన లోక్ సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎవరెవరికి టిక్కెట్లివ్వాలనేది మాత్రం తనకే వదిలేయాలంటున్నారట. ఇప్పుడున్న సిటింగుల్లో చాలామందిని మార్చాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. ఈ మేరకు ఆయన చంద్రబాబుకే నేరుగా చెప్పారట. వారిని మారిస్తేనే తాను పోటీ చేస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. డీటెయిల్డ్ రిపోర్టు కూడా ఇచ్చారట.

ఎవరిని మార్చినా మార్చకపోయినా కనిగిరి ఎమ్మెల్యే క‌దిరి బాబూరావు - య‌ర్రగొండ పాలెం ఎమ్మెల్యే డేవిడ్‌ రాజును మార్చాల్సిందేనని శ్రీనివాసుల రెడ్డి చెప్పారట. ఇంకా మరికొన్ని మార్పులు కూడా ఆయన సూచించారని తెలుస్తోంది.

అయితే.. మాగుంట రిపోర్టు సంగతి తెలిసిన కదిరి బాబూరావు - డేవిడ్ రాజులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. తమకు కనుక టిక్కెట్లు రాకపోతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని.. మాగుంటను ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఈ గొడవ ఇలా ఉండగా.... మాగుంట డిమాండ్లకు చంద్రబాబు ఓకే చెప్పారని తెలుస్తోంది. ఒంగోలు పార్లమెంటుకు మాగుంటను మించిన అభ్యర్థి లేకపోవడం.. ఎన్నికల ఖర్చు చూసుకునే సత్తా ఆయనకు ఉండడం వంటి కారణాలతో చంద్రబాబు ఆయన చెప్పిన ప్రతిదానికీ తల ఊపారని టాక్. దీంతో ప్రకాశం జిల్లాలో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలంతా మాగుంట వద్దకు క్యూ కడుతున్నారట.

ఇదంతా ఒకటి అయితే ప్రకాశం లో వైస్సార్ సీపీ చాలా స్ట్రాంగ్ గా వుంది. అక్కడ ఆ పార్టీ కి బాలినేని శ్రీనివాస్ మరియు వైవీ సుబ్బారెడ్డి లాంటి నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని ఎత్తులు వేసిన అక్కడ గెలవటం కల్ల అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు