Begin typing your search above and press return to search.

బాల‌కృష్ణ ఆ సర్టిఫికెట్‌తో ఎమ్మెల్యేగా ఉండ‌టానికి అన‌ర్హుడు: వైసీపీ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   27 Sep 2022 9:30 AM GMT
బాల‌కృష్ణ ఆ సర్టిఫికెట్‌తో ఎమ్మెల్యేగా ఉండ‌టానికి అన‌ర్హుడు: వైసీపీ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్‌!
X
విజ‌య‌వాడలో ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్సిటీగా పేరు మార్చ‌డంపై హిందూపురం ఎమ్మెల్యే, ప్ర‌ముఖ సినీ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌న పోస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు త‌దిత‌రులు ఆయ‌న‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు.

తాజాగా హిందూపురం వైసీపీ ఎమ్మెల్సీ, గ‌త ఎన్నిక‌ల్లో బాల‌కృష్ణ‌పై పోటీ చేసి ఓడిపోయిన మ‌హ్మ‌ద్ ఇక్బాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బాల‌కృష్ణ మాన‌సిక స్థితి స‌రిగా లేద‌ని గ‌తంలో డాక్ట‌ర్ స‌ర్టిఫికెట్ ఇచ్చార‌ని.. ఈ స‌ర్టిఫికెట్ ఉన్న‌వారు ఎమ్మెల్యేగా ఉండ‌టానికి అన‌ర్హులని తేల్చిచెప్పారు. దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తాన‌ని ఇక్బాల్ అంటున్నారు. అలాగే కోర్టులోనూ పిటిష‌న్ దాఖ‌లు చేస్తాన‌న్నారు.

బాల‌కృష్ణ జీవితం దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ భిక్ష అని ఇక్బాల్ స్ప‌ష్టం చేశారు. ఓ సినీ నిర్మాతను రివాల్వర్‌తో కాల్చిన కేసులో నాటి సీఎం వైఎస్సార్‌ పుణ్యంతోనే బాలకృష్ణ కేసు నుంచి బయటపడ్డార‌ని గుర్తు చేశారు. బాలకృష్ణ ప్ర‌స్తుతం సినిమాలు, రాజకీయాల్లో కొన‌సాగుతున్నారంటే అది వైయస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమమేని స్ప‌ష్టం చేశారు.

వైఎస్సార్‌, ఎన్టీఆర్‌ల‌ను గౌర‌వించి అభిమానించే ఏకైక పార్టీ వైఎస్సార్సీపీయేన‌ని తేల్చిచెప్పారు. ఎన్టీఆర్ పేరెత్తే అర్హ‌త చంద్ర‌బాబుకు కానీ, ఆయన వార‌సుల‌కు కానీ లేద‌న్నారు. ఆరోగ్య‌శ్రీ పేరును మార్చింద‌ని చంద్ర‌బాబేన‌ని గుర్తు చేశారు. రాజ‌కీయం కోసం మాత్ర‌మే ఎన్టీఆర్ పేరును చంద్ర‌బాబు, ఎన్టీఆర్ కుమారులు వాడుకుంటున్నార‌ని మండిప‌డ్డారు.

ప్ర‌జ‌ల్లో నుంచి ఎన్టీఆర్ పేరును తొల‌గించాల‌ని ప్ర‌య‌త్నించింది చంద్ర‌బాబు కాదా అని ఇక్బాల్ ప్ర‌శ్నించారు. ఎన్టీఆర్‌ను ప‌ద‌వీచ్యుతిడిని చేసి.. పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది చంద్ర‌బాబు కాదా అని ప్ర‌శ్నించారు. ఈ దారుణాన్ని ఎన్టీఆర్ కుమారులు అడ్డుకోక‌పోగా వారు ఆయ‌న‌ను వేధించార‌ని విమ‌ర్శించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై మాట్లాడే హక్కు చంద్రబాబు , బాలకృష్ణకు లేద‌ని తేల్చిచెప్పారు.

మానసిక క్షోభతో ఎన్టీఆర్ అకాల మరణం చెందడంపై చార్జిషీట్ దాఖ‌లు చేస్తే అందులో బావ, బామ్మర్దులయిన చంద్ర‌బాబు, బాల‌కృష్ణ‌ పేర్లే ఉంటాయన్నారు. ఈ నేప‌థ్యంలో బాల‌కృష్ణ ఎమ్మెల్సీ ఇక్బాల్ చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇక్బాల్ వ్యాఖ్య‌ల‌పై మ‌రోవైపు టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ఇక్బాల్ చేయ‌లేక‌పోయార‌ని, అలాగే ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ను తీసుకురాలేక‌పోయార‌ని విమ‌ర్శిస్తున్నారు. త‌న వైఫ‌ల్యాల‌ను ప‌క్క‌న‌పెట్టి బాల‌కృష్ణ‌ను విమ‌ర్శిస్తే త‌గిన స‌మాధానం చెబుతామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

మ‌రోవైపు అధికారం ఉన్నా, లేకపోయినా ఎమ్మెల్యే బాలకృష్ణ‌ తన సొంత నిధులను వెచ్చించి నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేస్తున్నార‌ని చెబుతున్నారు. వ‌రుస‌గా రెండుసార్లు హిందూపురం నుంచి బాల‌కృష్ణ గెల‌వ‌డానికి కార‌ణం నియోజ‌క‌వ‌ర్గంలో బాల‌య్య అభివృద్ధి చేయ‌డ‌మే అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.