Begin typing your search above and press return to search.
వైసీపీలో చేరకుండానే ఎమ్మెల్సీ పదవా?
By: Tupaki Desk | 13 Nov 2021 11:30 AM GMTఏపీలోని అధికార వైసీపీ నేతలకు ప్రభుత్వ పరంగా పదవి దక్కడం అంటే మామూలు విషయం కాదు. పార్టీ కోసం వీర విధేయతతో తీవ్రంగా కష్టించి పనిచేసి ఉండాలి. కష్టాల్లో అధినేత వైఎస్ జగన్ వెన్నంటి నడిచి ఉండాలి. అయినా.. జాతకం బాగోలేకుంటే అవకాశం అందనట్టే. ఇప్పటివరకు తనను నమ్ముకున్నవారికి సీఎం జగన్ న్యాయం చేస్తూ వస్తున్నారు. ఈ జాబితాలో ఒకటీ అరా నేతలు మిగిలిపోతున్నారు. పరిస్థితుల కారణంగా వారిని సర్దుబాటు చేయలేకపోవచ్చు. ఇదంతా పక్కనబెడితే..
గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, చేనేత వర్గానికి చెందిన సీనియర్ నేత మురుగుడు హనుమంతరావును మాత్రం అద్రష్టం వరించింది అని చెప్పొచ్చు. ఈయనను స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా శుక్రవారం ఎంపిక చేశారు.
టీడీపీ నుంచి వచ్చిన రెండు నెలలకే..
మురుగుడు హనుమంతరావు రాజకీయంగా సీనియర్. రెడ్డి, కాపు, కమ్మ.. ఈ మూడు ప్రధాన సామాజికవర్గాలు బలంగా ఉండే గుంటూరు జిల్లాలో బీసీ (పద్మశాలీ)ల నుంచి ఎదిగిన నేత. 1999, 2004లో వరుసగా రెండు సార్లు మంగళగిరిలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అప్పటి సీఎం దివంగత వైఎస్ కు సన్నిహితలయ్యారు. 2004లో కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చాక సమీకరణాల ప్రకారం వైఎస్.. మురుగుడును మంత్రిని కూడా చేశారు. అయితే, 2009లో ఓటమి పాలవడం.. అనంతరం రాష్ట్ర విభజన పరిణామాలతో రాజకీయంగా వెనుకబడ్డారు. 2014లో టీడీపీలో చేరారు. ఆప్కో చైర్మన్ వంటి రాష్ట్ర స్థాయి పదవిని పొందారు.
కానీ, 2019లో టీడీపీ ఓటమితో మురుగుడు పేరు మరోసారి మరుగున పడింది. కాగా, ఈ ఏడాది సెప్టెంబరు చివరి వారంలో హనుమంతరావు టీడీపీని వీడారు. ఆ సమయంలో టీడీపీపై విమర్శలు చేశారు. అనంతరం వైసీపీతో సన్నిహితంగా ఉండడం ప్రారంభించారు. అయితే, మురుగుడు ఇంకా వైసీపీలో చేరలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పడు ఏకంగా ఎమ్మెల్సీ పదవికి ఎంపికయ్యారు. దీనిపై వైసీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీని మొదటి నుంచి నమ్ముకుని ఉన్నవారి గురించి ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాయి. ఆయన ఇంకా పార్టీలో చేరనే లేదని.. కనీస సభ్యత్వం కూడా లేకుండానే పదవి ఇచ్చారనే చర్చ మాత్రం విస్తృతంగా సాగుతోంది. దీనిపై అధికార పార్టీ సమాధానం ఏంటో తెలియాల్సి వుంది.
కలిసొచ్చిన సామాజిక సమీకరణం
మురుగుడుకు సామాజిక సమీకరణాల ప్రకారమే పదవి దక్కిందనేది నిస్సందేహం. గుంటూరు జిల్లాలో మంగళగిరి చాలా కీలక నియోజకవర్గం. చేనేతల ప్రాబల్యం చాలా ఎక్కువ. దీనికితోడు వామపక్షాల ప్రభావమూ అధికమే. పైగా అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన అమరావతి రాజధానిలోని ముఖ్య ప్రాంతం. ఇన్ని సంక్లిష్టతలున్న నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామక్రష్ణారెడ్డి వైసీపీ అధినేత, సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు.
ఇక మంగళగిరి నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ బరిలో దిగారు. ఆయనను ఓడించడం వైసీపీకి ప్రతిష్ఠాత్మకమైంది. తద్వారా టీడీపీని చక్రబంధంలో పడేయాలనేది అప్పట్లో వారి వ్యూహం. దీంతో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి వచ్చిన వైఎస్ జగన్... లోకేశ్‌పై ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే ఇక్కడి చేనేతలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. దానిని ఇప్పుడు నిలబెట్టుకున్నారు. అలా జగన్ ఇచ్చిన హామీ హనుమంతరావుకు కలిసొచ్చింది.