Begin typing your search above and press return to search.
కవిత సవాల్ యూ టర్న్ తీసుకుంది
By: Tupaki Desk | 6 Jan 2016 5:03 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు - నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన సవాల్ కు తానే ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ నేతలకు దమ్ముంటే హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నుంచి రూ.20వేల కోట్ల నిధులు తెప్పించాలని, అప్పుడు తాను కూడా బీజేపీకే ఓటు వేస్తానంటూ కవిత సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ సవాల్ పై బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రాంచంద్రరావు తీవ్రంగా స్పందించారు.
బీజేపీ చేస్తున్న అభివృద్ధి గురించి సవాల్ విసిరే ముందు కవిత వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ప్రభుత్వ లెక్కలు చూసుకునే సమయం లేకపోయినా కనీసం వ్యక్తిగత విషయాలు అయినా పట్టించుకోవాలని అన్నారు. ఎంపీ కవితకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటు హక్కే లేదని, అలాంటప్పుడు ఆమె ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు. బీజేపీపై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా విరుచుకుపడాలని అనుకుంటే తామేం చేయగలమని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నదని ఈ క్రమంలో సందర్భాన్ని, అవసరాన్ని బట్టి నిధులు కేటాయిస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి గడ్కరీ తాజా పర్యటనలో రూ.30 వేల కోట్లతో రోడ్లకు శ్రీకారం చుట్టడం ఇందుకు నిదర్శనమన్నారు.