Begin typing your search above and press return to search.
ఈ లెక్కన కేసీఆర్‌లో భయం మొదలైనట్లేనా?
By: Tupaki Desk | 15 Oct 2018 3:46 PM GMTగులాబీ దళపతి తెలంగాణ అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌లో భయం మొదలైందా? ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పార్టీలో తీవ్రంగా తెరమీదకు వచ్చిన అసమ్మతి ఆయన్ను కలవరపెడుతోందా? పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆయనకు పంటికింద రాయిలా మారుతున్నాయా? అందుకే నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో భాగంగా సస్పెన్షన్ వేటు వేస్తున్నారా? అంటే అవుననే సమాచారం వస్తోంది.తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ పై ఆ పార్టీ వేటు వేసింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి రాములు నాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ పరిణామం ప్రకారమే కొత్త చర్చ తెరమీదకు వస్తోంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ పై వేటు వేస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పుడుతున్నందు వలనే రాములు నాయక్‌ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. ఎన్నికల నేపథ్యంలో నారాయణ ఖేడ్ నుండి బరిలోకి దిగాలని రాములు నాయక్ భావిస్తున్టన్లు సమాచారం. ఈ మేరకు అధిష్టానానికి వెళ్లడించారు. అయితే, దానికి వారు నో చెప్పినట్లు తెలిసింది. దీంతో నాయక్ తనదారి తాను చూసుకున్నారు. రాములు నాయక్ త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా ఆయన ముమ్ముర కసరత్తులు చేస్తున్నారని, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియాను కలిసినట్టు సమాచారం. కాంగ్రెస్‌లో చేరి తనకు ఆసక్తి ఉన్న నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు చెప్తున్నారు. కాగా, అసంతృప్తికి ఆదిలోనే చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
పార్టీ నుంచి తనను సస్పెన్షన్ చేయడంతో రాములునాయక్ మీడియాతో మాట్లాడుతూ గిరిజనులకు రిజర్వేషన్ కోరినందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? అని నిలదీశారు. డి. శ్రీనివాస్ - కొండా సురేఖను సస్పెండ్ చేయాలని అందరూ కోరితే చేయలేదు గానీ.. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే తనను సస్పెండ్ చేశారన్నారు. టీఆర్ఎస్‌లో ప్రజాస్వామ్యం - ఆత్మగౌరవం లేదని - అదో ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా తయారైపోయిందని ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.