Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో ‘స్థానిక సంస్థల’ ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదల

By:  Tupaki Desk   |   9 Nov 2021 9:30 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో ‘స్థానిక సంస్థల’ ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదల
X
ఏపీ, తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లో 11 ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది.

అనంతపురం 1, కృష్ణా 2, తూర్పు గోదావరి 1, గుంటూరు 2, విజయనగరం 1, విశాఖపట్నం 2, చిత్తూరు 1, ప్రకాశం 1 చొప్పున ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

అలాగే తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి , కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా ఆయా జిల్లాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ 16న విడుదల కానుంది. నవంబర్ 23 వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగనుంది.

అలాగే నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఇక డిసెంబర్ 10న పోలింగ్ జరుగనుంది. 14న కౌంటింగ్ చేసి ఫలితాలను వెల్లడించనున్నారు.