Begin typing your search above and press return to search.

ఖాళీ అయ్యే 3 ఎమ్మెల్సీల్లో సిట్టింగుల‌కేనా?

By:  Tupaki Desk   |   29 Sep 2018 5:06 AM GMT
ఖాళీ అయ్యే 3 ఎమ్మెల్సీల్లో సిట్టింగుల‌కేనా?
X
దాదాపు ఆర్నెల్ల త‌ర్వాత ఖాళీ అయ్యే మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు సంబంధించిన చ‌ర్చ మొద‌లైంది. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయ్యే మూడు స్థానాల‌కు సంబంధించి ఓట‌ర్ల స‌వ‌ర‌ణ కోసం కేంద్ర ఎన్నిక‌ల సంగం తాజాగా నోటిఫికేష‌న్ జారీ చేయ‌టంతో.. ఖాళీ అయ్యే ఈ మూడు స్థానాల మాటేమిటి? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది.

వాస్త‌వానికి టీఆర్ ఎస్ తో స‌హా అన్ని రాజ‌కీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నిక‌ల హ‌డావుడిలో ఉన్నాయి. అయితే.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎమ్మెల్సీ స్థానాల‌కు సంబంధించిన ఓట‌ర్ల జాబితాను అప్డేట్ చేయాల‌ని నోటిఫికేష‌న్ జారీ చేయ‌టంతో రాజ‌కీయ చ‌ర్చ షురూ అయ్యింది.

ఖాళీ అయ్యే మూడు స్థానాల విష‌యానికి వ‌స్తే.. మండ‌లి ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న స్వామిగైడ్‌.. ప్ర‌భుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాక‌ర్ రెడ్డి.. మ‌రో ఎమ్మెల్సీ పూల ర‌వీంద‌ర్ ల స్థానం ఖాళీ కానుంది. స్వామిగౌడ్ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం (మెద‌క్‌- నిజామాబాద్‌- అదిలాబాద్‌-క‌రీంన‌గ‌ర్‌) నుంచి ఎన్నిక కాగా.. పాతూరి ఉపాధ్యాల స్థానం (మెద‌క్ - నిజామాబాద్ - అదిలాబాద్ - క‌రీంన‌గ‌ర్‌) నుంచి ఎన్నిక‌య్యారు. ఇక‌.. మ‌రో ఎమ్మెల్సీ పూల ర‌వీంద‌ర్ సైతం ఉపాధ్యాయుల స్థానం (వ‌రంగ‌ల్ - ఖ‌మ్మం - న‌ల్ల‌గొండ‌) నుంచి ఎన్నిక‌య్యారు. వీరు ముగ్గురు టీఆర్ ఎస్ పార్టీ నుంచే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ మూడు స్థానాల్ని సిట్టింగుల‌కు ఇస్తారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే.. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ ఎస్ మ‌ద్ద‌తుతో ఉన్న గ్రూప్ 1 సంఘం అధ్య‌క్షుడు చంద్ర‌శేఖ‌ర్ గౌడ్ పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. దీంతో.. స్వామిగౌడ్‌ కు ఈసారి అవ‌కాశం ల‌భిస్తుందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. మ‌రోవైపు.. రెండు ఉపాధ్యాయ స్థానాల నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పాతూరి.. పూల ర‌వీంద‌ర్ ల‌కు అవ‌కాశం ల‌భిస్తుందా? అన్న‌ది కూడా క్వ‌శ్చ‌నేన‌ని చెబుతున్నారు. ఈ ముగ్గురుకు సంబంధించిన నిర్ణ‌యం అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని.. అప్ప‌టివ‌ర‌కూ పార్టీ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాన్ని వెల్ల‌డించే అవ‌కాశం లేదంటున్నారు.