Begin typing your search above and press return to search.
తెలంగాణలో ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్సీలు
By: Tupaki Desk | 15 Nov 2017 10:49 AM GMTమరో ఏడాదిన్నరలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టీఆర్ఎస్ విజయంపై ధీమాతో ఉన్న నేతలు ఇప్పటి నుంచే టిక్కెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారట. ఎన్నికల్లో టిక్కెట్ తమకే వస్తుందని చాలామంది నేతలు ధీమాగా ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇటు ఎమ్మెల్యేలు, అటు ఎమ్మెల్సీలు టిక్కెట్ తమదంటే తమదేనని నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారట. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తనకే టిక్కెట్ ఇస్తారని ఆయా నాయకులు అనుచరులకు చెబుతున్నారట. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటాపోటీగా తమకే టిక్కెట్ అని చెప్పుకోవడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో పలుచోట్ల ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్సీలుగా మారిందని చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఓ వైపు ఎమ్మెల్సీలు, మరోవైపు సంబంధితన నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. ఈ విషయం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టికి వెళ్లిందట. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం సాగుతోంది. తోక జాడించకుండా హద్దుల్లో ఉండాలని ఆయా ఎమ్మెల్సీలకు ఆయన హెచ్చరికలు జారీ చేశారని సమాచారం.
చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య నెలకొన్న వివాదాలపై కేసీఆర్ ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకున్నారని పొలిటికల్ వర్గాలు కోడైకూస్తున్నాయి. కొందరు నేతల నుంచి కూడా మరింత సమాచారం కోసం ఆరా తీశారని చెబుతున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గులాబీ కండువా కప్పుకుని కారు ఎక్కేశారు. ఎమ్మెల్యేలు ఉన్నచోట ఇంచార్జులు, ఇంచార్జులు ఉన్నచోట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెరాసలో చేరిపోయారు.
అయితే తాజా వివాదంలో ముఖ్యంగా ఎమ్మెల్సీలపైనే కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టీఆర్ఎస్ సర్కిల్లో ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని సీఎం గట్టిగా హెచ్చరించారని.. దీంతో తమకు టిక్కెట్లు వస్తాయా.. రావా అనే ఆందోళనలో పలువురు ఎమ్మెల్సీలు ఉన్నారని సమాచారం. పూర్వ నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య టిక్కెట్ పోరు నడుస్తోంది. దీనిపై సమగ్ర సమాచారం తెప్పించుకున్న కేసీఆర్.. ఎమ్మెల్సీలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు.