Begin typing your search above and press return to search.

రాష్ట్రంలో అత్యధిక ఆస్తులున్న ఎమ్మెల్సీ ఎవరు? నేరచరితులు ఎవరు?

By:  Tupaki Desk   |   25 Aug 2022 10:30 AM GMT
రాష్ట్రంలో అత్యధిక ఆస్తులున్న ఎమ్మెల్సీ ఎవరు? నేరచరితులు ఎవరు?
X
తెలంగాణ శాసనమండలిలో అత్యధిక ఆస్తులున్న ఎమ్మెల్సీ ఎవరో.. అలాగే నేరచరితులు ఎంతో మంది ఉన్నా లెక్క తేలింది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. శాసనమండలిలో ఆరుగురిపై తీవ్ర అభియోగాలున్నాయని.. వారంతా టీఆర్ఎస్ కు చెందినవారేనని తెలిపింది.

మండలిలో 40 మంది ఎమ్మెల్సీల్లో 33 మంది నామినేషన్ల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా వారిపై ఉన్న కేసులు, ఆస్తులు, విద్యార్హత తదితర వివరాలతో కూడిన నివేదికకు ఏడీఆర్ తాజాగా విడుదల చేసింది.

తెలంగాణ శాసనమండలిలో 10మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తేలింది. అందులో ఆరుగురు టీఆర్ఎస్ కు చెందిన వారే కావడం గమనార్హం. ఈ ఆరుగురిపై తీవ్రమైన అభియోగాలున్నాయని తేలింది. సభ్యుల్లో ఇద్దరు డాక్టరేట్లు ఉన్నాయని పేర్కొంది.

కురుమయ్యగారి నవీన్ (టీఆర్ఎస్) అఫిడవిట్ అందుబాటులో లేకపోవడం.. ఆరుగురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు అఫిడవిట్లు సమర్పించాల్సిన అవసరం లేకపోవడంతో వారి వివరాలను నివేదికలో పొందుపరచలేదు.

ఇక ఐదేళ్లు పైబడిన జైలు శిక్ష పడిన కేసులు.. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేవి.. ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంగనకు సంబంధించిన కేసులను తీవ్రమైనవిగా పరిగణిస్తారు. పాడి కౌశిక్ రెడ్డి, మహమూద్ అలీ, కసిరెడ్డి నారాయణరెడ్డి, బండి ప్రకాష్, కడియం శ్రీహరి, మంకెన కోటిరెడ్డిపై ఇటువంటి కేసులున్నాయి.

సత్యవతి రాథోడ్, కల్వకుంట్ల కవిత, కృష్ణారెడ్డి, సుఖేందర్ రెడ్డిపై సాధారణ కేసులున్నాయి. 33 మంది ఎమ్మెల్సీల్లో ఇద్దరు డాక్టరేట్లు ఉన్నారు. 8 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 9 మంది గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్స్, 10మంది గ్రాడ్యూయేట్లు, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు ఇద్దరు, పదోతరగతి ఒకరు, 5వ తరగతి ఒకరు పాస్ అయ్యి ఉన్నారు.