Begin typing your search above and press return to search.
మొబైల్ ఇంటర్నెట్ పై తొలి నిషేధం
By: Tupaki Desk | 20 Sep 2015 8:59 AM GMTబీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనసాగుతున్న నిషేధాల పరంపర తారస్థాయికి చేరింది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో శనివారం మధ్యాహ్నం నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. ఈ నిషేధం ఎంతకాలం ఉంటుందనేది ఇంకా ప్రకటించలేదు. పటేల్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ అరెస్టు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ముందస్తుగా మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం విధించామని అక్కడి పోలీసులు చెబుతున్నారు.
పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పాస్ (పాటిదార్ ఆరక్షణ్ ఆందోళన్ సమితి) నాయకుడు హార్దిక్ పటేల్ సూరత్ నుంచి ప్రారంభించిన ఏక్తా యాత్రాను పోలీసులు అడ్డుకోవడం.. దాంతో ఆందోళనలు చెలరేగడం తెలిసిందే. పటేల్ అరెస్టుతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి... ఆయన్ను విడుదల చేయకుంటే జైల్ భరో కార్యక్రమానికి దిగుతామని వారు హెచ్చరించారు. దీంతో సమాచార వ్యాప్తి నిరోధానికి గాను ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం విధించింది.
గతంలోనూ మత కల్లోలాలు, ఇతర ఉద్రిక్త సమయాల్లో దేశంలో సులభ సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు బల్క్ ఎస్సెమ్మెస్సులను నిషేధించారు. అయితే... మొబైల్ ఇంటర్నెట్ ను నిషేధించిన తొలి రాష్ట్రం మాత్రం గుజరాతే. అరచేతిలో ఇంటర్నెట్ వచ్చేశాక... రోజువారీ పనుల్లో అధికశాతం మొబైల్ ఇంటర్నెట్ ఆధారంగానే సాగుతన్నాయి. నిషేధం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు.