Begin typing your search above and press return to search.

పంజాబ్​, హర్యానాలో మొబైల్​, ఇంటర్నెట్​ బంద్​..!

By:  Tupaki Desk   |   27 Jan 2021 9:45 AM GMT
పంజాబ్​, హర్యానాలో మొబైల్​, ఇంటర్నెట్​ బంద్​..!
X
రైతుల ఆందోళనతో దేశ రాజధాని అట్టుడుకుతున్నది. నిన్నటి రైతన్న ఆందోళన హింసాత్మకం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అలర్ట్​ అయ్యింది. పంజాబ్​, హర్యానాలో ఉద్యమం తీవ్రరూపం దాల్చకముందే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని చూస్తున్నది. ఇందుకోసం ఆ రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్​, మొబైల్ సేవలు నిలిపివేశారు. అయితే కేవలం పంజాబ్​, హర్యానాకు చెందిన రైతులే రైతు ఆందోళనలో పాల్గొన్నట్టు కేంద్రం భావిస్తున్నది. జనవరి 26న ఎర్రకోటపై రైతులు జెండాలు ఎగరవేసిన అంశం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ మీడియా సైతం ఈ ఆందోళనను కవర్​ చేసింది.

ఈ నేపథ్యంలో పంజాబ్​, హర్యానా రాష్ట్రాల్లో ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో హై అలర్ట్​ ప్రకటించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్​ సేవలు సేవలు నిలిపివేయగా.. తాజాగా మొబైల్​ సేవలు కూడా బంద్​ చేశారు. అయితే పంజాబ్​, హర్యానా రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని.. అయితే ఆందోళన కారులు ప్రభుత్వ, ప్రైవేట్​ ఆస్తులను ధ్వంసం చేసే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శాంతి భద్రతతలను అదుపులోకి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు 15 కంపెనీల అదనపు బలగాలను దించారు. మరికొన్ని బలగాలు కూడా దించే అవకాశం ఉంది. సోనిపట్, ఝాజర్, పల్వాల్ జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు టెలీకాం సర్వీసులు పనిచేయవని తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు.