Begin typing your search above and press return to search.

నోట్ల రద్దు వారికెంతో ముద్దు

By:  Tupaki Desk   |   14 Nov 2016 11:18 AM GMT
నోట్ల రద్దు వారికెంతో ముద్దు
X
ప్రధాని మోడీ దేశంలో 500 - 1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అంతేకాదు... అదిప్పుడు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరినీ రోడ్లపైకి ఉరికించి లైన్లలో నించోబెడుతోంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఎంతో ఇబ్బంది పెడుతున్న ఈ నోట్ల రద్దు నిర్ణయం అందరికీ ఎంతో కొంత నష్టం కలిగించింది. అయితే... ఈ డెసిషన్ తో అత్యధిక లాభం పొందినవారూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అత్యధిక లాభం ఎవరికంటే మొబైల్ వ్యాలట్ల సంస్థలకే అని చెప్పాలి. అందులోనూ ప్రధానమైన వ్యాలట్లయిన పేటీఎం - మొబిక్విక్- ఫ్రీచార్జిలదే అగ్రస్థానం. మోడీ నిర్ణయం దెబ్బకు వారికి కలిగిన లాభం వింటే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే.

గత పదేళ్లలో ఎన్ని వ్యాలట్ ఖాతాలు ఓపెనయ్యాయో మోడీ ప్రకటన తరువాత అరగంటలో అన్ని ఓపెనయ్యాయి.

అంతేకాదు... పేటీఎం సంస్థ 2018కి సాధించాలనుకున్న లక్ష్యాలన్నీ 24 గంటల్లో రీచయ్యాయి. ఆన్ లైన్ పేమెంట్లలో 200 శాతం.. ఆఫ్ లైన్ పేమెంట్లలో 400 శాతం వృద్ధి నమోదైంది. ఇక వ్యాపారమైతే పది రెట్లు పెరిగిందట.

మరో వ్యాలట్ సంస్థ మొబిక్విక్ దీ అదే దారి. ఈ దెబ్బకు ఆ సంస్థ టార్గెట్లన్నీ రీచయిపోవడంతో టార్గెట్లను మళ్లీ సవరించుకుని ఇంకా లాభపడాలని వెంటనే కొత్త కార్యాచరణ రూపొందించుకున్నారు. స్నాప్ డీల్ కు చెందిన ఫ్రీఛార్జి కూడా భారీగా లాభపడింది.

పేటీఎం అయితే... సంవత్సర కాలం లాభం 24 గంటల్లో వచ్చేయడంతో ఉబ్బితబ్బిబ్బయింది. మోడీకి థాంక్సు చెబుతూ జాతీయ పత్రికల్లో మొదటి పేజీల్లో పూర్తి పేజీల ప్రకటనలు ఇచ్చింది. మోడీ ఫొటోతో వచ్చిన ఆ ప్రకటన వివాదాస్పదమైనప్పటికీ.. ఎన్నడూ లేనట్లుగా వ్యాలట్ సంస్థలు అంత భారీగా ప్రకటనలకు ఖర్చు చేశాయంటే అవి ఎంతగా ఆదరణ పెంచుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. మోడీ దెబ్బకు నగదన్నది దొరక్కపోవడంతో అంతా చిన్నచిన్న పేమెంట్ల నుంచి పెద్ద పేమెంట్లు - నగదు బదిలీకి వ్యాలట్లపై ఆధారపడుతున్నారు. మొత్తానికి దేశంలో ఒక్కసారిగా డిజిటల్ మనీ విప్లవం వచ్చినట్లయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/