Begin typing your search above and press return to search.
ఆ మంత్రి వారానికి ఒక సారి నా ఇంటికి వచ్చేవారు - నటి
By: Tupaki Desk | 27 July 2022 12:30 PM GMTపశ్చిమ బెంగాల్ లో ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడుల్లో అడ్డంగా దొరికిపోయిన సినీ నటి, మోడల్ అర్పిత ముఖర్జీ తనకే పాపం తెలియదని చెబుతోంది. తన ఇంట్లో దొరికిన రూ.21 కోట్ల డబ్బంతా పశ్చిమ బెంగాల్ పరిశ్రమల శాఖ పార్థా చటర్జీదేనని వెల్లడించిందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఈడీ విచారణలో అన్ని విషయాలను అర్పిత పూసగుచ్చినట్టు తెలిపిందని సమాచారం.
అంతేకాకుండా పార్థా చటర్జీ తన ఇంటికి వారానికి ఒకసారి వస్తాడని కూడా అర్పిత ఈడీ విచారణలో బాంబుపేల్చిందని అంటున్నారు. వారానికోసారి తన ఇంటికి వచ్చి బీరువాల్లో ఆ డబ్బును చూసుకుని వెళ్లేవాడని అర్పిత ఈడీ అధికారులకు వివరించినట్టు సమాచారం. అంతేకాకుండా ఆ రూ.21 కోట్ల డబ్బంతా లంచాల రూపంలో వచ్చిందేనని అర్పితా ముఖర్జీ చెప్పినట్టు తెలుస్తోంది.
కాగా తనిఖీల్లో అర్పిత ఇంట్లో ఈడీ అధికారులు ఓ నల్ల డైరీని గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో కుంభకోణానికి సంబంధించిన కీలక రహస్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అందులోని వివరాల ఆధారంగా అర్పితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
ఈ డైరీలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలోని ఉన్నత విద్య, పాఠశాల విద్య విభాగానికి చెందిన అనేక ఉన్నతాధికారుల పేర్లు ఉన్నాయని అంటున్నారు. నల్ల డైరీలో 40 పేజీల్లో చాలా విషయాలు రాసి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఈ వివరాలతో ఉపాధ్యాయ నియామక కుంభకోణంలోని రహస్యాలను బట్టబయలు చేయొచ్చని చెబుతున్నారు.
కాగా అర్పిత, పార్థా చటర్జీలకు కోర్టు ఆగస్టు 3 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు పార్థా చటర్జీ మాత్రం విచారణకు సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఆయన మూడే మూడు పదాలను ఈడీ అధికారులకు చెబుతున్నారని అంటున్నారు. నాకు తెలియదు, గుర్తు లేదు, సరిగ్గా చెప్పలేను అని ఈ మూడు పదాలనే ఆయన ఈడీ అధికారుల ప్రశ్నలకు బదులు ఇస్తున్నారని చెబుతున్నారు.