Begin typing your search above and press return to search.
పది మంది భార్యలు కావాలంటున్న మోడల్
By: Tupaki Desk | 6 April 2022 6:11 AM GMTఒక్కరిని చేసుకుంటేనే తల ప్రాణం తోకకు వస్తుంది. పెళ్లాం బాధితులు రోడ్డెక్కి నానా యాగీ చేస్తున్నారు. కర్మ సిద్ధాంతం అంతా అర్థమైనట్టు కొందరు సన్యాసం పుచ్చుకుంటున్నారు. కానీ వీడి బండబడ ఏకంగా 10 మందిని పెళ్లి చేసుకున్నాడు. అందరినీ సుఖపెడుతున్నాడు. పడుతున్నాడు. కానీ ఒక భార్య మాత్రం తాజాగా షాకిచ్చింది.
బ్రెజిల్ కు చెందిన ఓ మోడల్ ఆర్థర్ ఓ ఉర్సో 9 మంది మహిళలను వివాహం చేసుకొని ఇటీవల వార్తల్లో ఎక్కాడు. ఇతడు అంత మందిని పెళ్లి చేసుకుందామని అన్నా వాళ్లు ఎలా ఒప్పుకున్నారు? ఇతడిని ఎలా చేసుకున్నారన్నది ఎవరికీ అంతుబట్టలేదు. పైగా ఆ తొమ్మిది మందితో మనోడు సెల్ఫీలు, ఫొటోలు దిగి మీడియాకు ఎక్కి రచ్చ చేశాడు. అది వైరల్ అయ్యింది.
కాగా ఆ తొమ్మిది మంది భార్యల్లో ఒక భార్య తాజాగా షాక్ ఇచ్చింది. ఉర్సో నుంచి విడాకులు కోరిందట.. ఆమె ఏకస్వామ్య సంబంధాన్ని కోరుకుంటోందట.. అందుకే విడాకులు అడిగిందని ఉర్సో చెప్పాడు.
తాను మాత్రం మరింత మందిని పెళ్లి చేసుకోవాలని యోచిస్తున్నట్టు ఆ మోడల్ తెలిపాడు. 10 మంది భార్యలతో ఉండడమే తన కోరిక అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
ఇలా ఒక్కరితోనే వేగలేక కింద మీద పడుతున్న పురుష పుంగవులకు ఇతగాడి తొమ్మిది మంది భార్యలు ఎంత టార్చర్ పెడుతారో.? అయినా వారందరినీ ఎలా మెయింటేన్ చేస్తాడోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పటికైతే ఒక భార్య వెళ్లిపోయింది.
మిగతా తొమ్మిది మందిని ఎలా చూసుకుంటాడో గురుడు అని చాలా మంది సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.