Begin typing your search above and press return to search.

మోడీ... ఇప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్

By:  Tupaki Desk   |   29 Dec 2016 8:30 PM GMT
మోడీ... ఇప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్
X
స్టార్ క్రికెట‌ర్ ధోనీ బ్రాండ్‌ విలువ 23 మిలియన్‌ డాలర్లు
విరాట్‌ కోహ్లీ బ్రాండ్‌ విలువ 18 మిలియన్‌ డాలర్లు
క్రిస్‌ గేల్‌ బ్రాండ్‌ విలువ 3 మిలియన్‌ డాలర్లు
మ‌రి ప్ర‌ధాని నరేంద్ర వెూడీ బ్రాండ్‌ విలువ...? అది వీరందరి బ్రాండ్ వాల్యూ కన్నా 10 రెట్లు ఎక్కువ‌.

మోడీ గత రెండున్నరేళ్ళలో తీపి చేదులు రెండూ చ‌విచూశారు. ఎన్నిక‌ల్లో విజ‌యాలు - పరాజ‌యాలు చూశారు. విజయాలు - విమ‌ర్శ‌లు రెండూ చూశారు. అయితే ఆయన చేపట్టిన పథకాలు ఆయన్నొక పాలకుడిగా కాకుండా ప్రపంచం అనుసరించదగ్గ మార్గదర్శిగా గుర్తింపు సాధించిపెట్టా యి. భారత ప్రధానుల్లో ఇంతవరకు ఎవరికీ లభించని బ్రాండ్‌ ఇమేజ్‌ను ఆయనకు తెచ్చిపెట్టాయి. ఎన్నికల్లో అనుసరించిన ఆధునిక విధానాలతో పాటు ప్రధాని అయ్యాక చేపట్టిన స్వచ్ఛభారత్‌ వంటి కార్యక్రమాలు ఈ ఇమేజ్‌ ను అనూహ్యంగా పెంచాయి. ప్రపంచంలోనే మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతోపాటు దానికి ప్రాచుర్యం కల్పించడంలోనూ ఆయన ప్రతిభ ప్రపంచ గుర్తింపు పొందింది. దీంతో మోడీ అన్న పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది. మోడీ పేరు, ఆయ‌న విధానాల‌ను ప్ర‌స్తావించి తమ ఉత్పత్తులు, స‌ర్వీసుల‌కు బ్రాండ్‌ విలువ పెంచుకునేందుకు పారిశ్రామిక వేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా దేశంలో తొలిసారిగా 4జి - ఎల్‌ టిఇ వ్యవస్థను ప్రవేశపెట్టిన రిలయన్స్‌ జియో కూడా మోడినే బ్రాండ్‌ అంబాసిడర్‌ గా తన ప్రకటనల్లో వినియోగించుకుంది.

పెద్దనోట్ల రద్దు అనంతరం క్యాష్‌లెస్ అన్నపదాన్ని మోడి ప్రయోగించారు. ఇప్పుడు దేశవ్యా ప్తంగా ఇదో ఫ్యాషన్‌ గా మారింది. క్యాష్‌ లెస్‌ ఎటిఎమ్‌ - క్యాష్‌ లెస్‌ బ్యాంకులంటూ ఎగతాళి చేసిన జనమే ఇప్పుడు లెస్‌ అన్న పదానికి అలవాటుపడ్డారు. బ్యాగ్‌ లెస్‌ స్కూల్స్‌ అంటూ కొత్త ప్రయోగం మొదలైంది. ఎగ్‌ లెస్‌ ఆహారమంటూ ఇస్కాన్‌ ప్రతిపాదించింది. పాఠశాల పిల్లలకు సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యతల్ని చేపట్టిన ఇస్కాన్‌.. కోడిగుడ్లకు బదులు అదే స్థాయిలో పౌష్టికాహార సరఫరాకు అంగీకరిస్తూ ఎగ్‌ లెస్‌ మీల్స్‌ ను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఫ్యాట్‌ లెస్‌ ఆహారపదార్థాల విక్రయం జోరందుకుంది. కెమికల్‌ లెస్‌ సౌందర్యసాధనాల ఉత్పత్తి మొదలైంది. ఆఖరకు ఫెర్టిలైజర్‌ లెస్‌ కాయగూరలు - బియ్యం విక్రయాలు జరుగుతున్నా యి. ఇలా మోడి నోటి నుంచి వచ్చిన ఏ మాటైనా వస్తువుల విక్రయాల పెంపునకు దారితీస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న క్రీడాకారులు - సినీనటులకు బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంటుంది. వీరి ఇమేజ్‌ విలువకనుగుణంగా వీరితో ప్రచారం చేయించుకునే సంస్థలు వీరికి చెల్లింపులు జరుపుతాయి. ప్రతి ఏటా వీరి ఇమేజ్‌ను లెక్కగట్టేం దుకు ప్రపంచస్థాయిలో కొన్ని ప్రత్యేక సంస్థలున్నాయి. వీరితో పాటే గత దశాబ్దంలో పాలకులు కూడా సొంతంగా ఇమేజ్‌ ను ఏర్పాటు చేసుకోవడం మొదలెట్టారు. ఇందులోకి మోడీ కూడా వ‌చ్చి చేరారు.
ప్రపంచ పాలకుల్లో అత్యధిక బ్రాండ్‌ విలువను ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఒబామా కలిగి ఉంటే ఆ తర్వాత స్థానాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ - చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ నిల్చారు. ఆ తర్వాత స్థానాన్ని మోడి ఆక్రమించారు. ప్రపంచంలోని 65 ప్రధాన దేశాల్లోని 24శాతం ఓటర్లు మోడికి ఈ స్థానం కల్పించారు. పెద్దనోట్ల రద్దు అనంతర పరిణామాలతో మోడి విమర్శలకు గురవుతున్నా ఆయన పేరుకున్న పాపులారిటీ మాత్రం కొంచెం కూడా త‌గ్గ‌లేద‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/