Begin typing your search above and press return to search.
ప్రపంచానికి ఏం చెబుదాం.. తలపట్టుకున్న మోడీ
By: Tupaki Desk | 21 Jan 2023 11:30 AM GMTఔను! ఇప్పుడు ప్రపంచానికి ఏం చెబుదాం.. ఇదీ.. ప్రధాని నరేంద్ర మోడీ ముందున్న చిక్కు ప్రశ్న. అంత కుమించి తలభారంగా మారిన విషయం కూడా! దీనికి కారణం.. బీబీసీ ఇటీవల ప్రసారం చేసిన 'మోడీ ఏ క్వశ్చన్' డాక్యుమెంటరీనే కారణం. ఈ డాక్యుమెంటరీ అంతా కూడా.. మోడీని విలన్ గా చూపించేలా ఉందన్నది బీజేపీ నేతల మాట. దీంతో దేశంలోని పలువురు దీనిని ఖండించారు.
ఇక, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని.. ఖండించింది. అవాస్తవాలను వాస్తవాలు గా ప్రసారం చేశారని పేర్కొంది. ఇంతకీ.. ఇదేంటంటే.. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లు, అనంతర మార ణకాండపైనే.
ఈ వ్యవహారంలో ఆర్ ఎస్ ఎస్, విస్వహిందూ పరిషత్ పాత్ర ఉందని, రాష్ట్రంలో అధికారం లో ఉన్న మోడీ.. చేసినా.. సహకరిస్తారనే ధైర్యంతోనే వారు అలా తెగబడ్డారని డాక్యుమెంటరీ స్పష్టం చేసింది.
అంతేకాదు.. మోడీ కూడా సర్వ పోలీసు వ్యవస్థను ఈ విషయంలో సుప్తచేతనావస్థకు చేర్చారని, దీంతో జరగాల్సిన ఘోరం జరిగిపోయిందని బీబీసీ వ్యాఖ్యానించింది. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఏం చేయాలనేది మోడీకి చిక్కుగా మారింది.
ఎందుకంటే.. ఇప్పటి వరకు ప్రపంచదేశాలకు.. తనను తాను ఒక ఇంటలెట్యువల్‌గా పరిచేసుకున్న మోడీ.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో శాంతి వచనాలు పలికారు.
భారత్ శాంతినే కోరుకుంటోందని తెలిపారు. తరతరాలుగా భారత్ శాంతికాముక దేశమని వెల్లడించారు. అదేసమయంలో భారత్‌ను విశ్వగురువుగా పరిచయం చేస్తున్నారు. ఇలాంటి కీలకసమయంలో అనూ హ్యంగా మోడీని విలన్‌గా చూపిస్తూ.. బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ.. ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా పాకిస్థాన్ వంటి దేశాల్లో హల్చల్ చేస్తోంది.
దీంతో ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత మోడీకి ఉన్నాయి. ఆయన మౌనంగా ఉంటే.. ప్రపంచం దీనినే నమ్ముతుందనే భావన బీజేపీలో ఉంది. ఈ నేపథ్యంలో మోడీతనను ప్రిపేర్ చేసుకుంటున్నట్టు సమాచారం. మరి ఏం చెబుతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.