Begin typing your search above and press return to search.
ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు.. మరి 8 ఏళ్లుగా ఏం చేసినట్లు మోడీ?
By: Tupaki Desk | 15 Jun 2022 10:30 AM GMTతానేం అనుకుంటే దాన్ని మాత్రమే చేయటం తప్పించి.. మిగిలిన వారి మాటల్ని వినేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధంగా ఉండరని చెబుతుంటారు. విషయం ఏదైనా.. దానికి సంబంధించిన నిర్ణయాన్ని తనకు తానుగా తీసుకునే ఆయన ధోరణితో బీజేపీ మొత్తం ఇప్పుడు ఆయన చుట్టూ తిరుగుతోంది. దీంతో.. సహజసిద్ధంగా.. స్వాభావికంగా తమ పని తాము చేసుకుంటూ పోయే అలవాటున్న కమలనాథులు.. తమ స్వభావానికి భిన్నమైన తీరును ప్రదర్శిస్తున్నారన్న విమర్శ ఉంది.
దేశానికి మోడీ వల్ల జరిగిన నష్టం ఏమిటన్న దానిపై ఎంతటి ఘాటు వాదనలు సిద్ధంగా ఉంటాయో.. మోడీ జమానాలో బీజేపీ ఎంతలా నిర్వీర్యం అయిపోయిందన్న విషయంపై లోగుట్టుగా గళం విప్పే బీజేపీ నేతలకు తక్కువ లేదని చెబుతారు. ఇప్పటి బీజేపీకి.. గతంలోని కమలం పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదని చెబుతున్నారు. గతంలో ప్రతిభ ఉంటే సరిపోయేదని.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. తాను అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో ఎప్పుడూ లేని రీతిలో తాజాగా భారీ ప్రకటనను విడుదల చేసింది మోడీ ప్రభుత్వం.
రానున్న 18 నెలల వ్యవధిలో 10 లక్షల ఉద్యోగాల్ని మిషన్ మోడ్ లో భర్తీ చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవటం.. దానికి తగ్గ ఆదేశాలు జారీ చేసినట్లుగా పీఎంవో (ప్రధానమంత్రి కార్యాలయం) ట్విటర్ ద్వారా పేర్కొనటం ఆసక్తికరంగా మారింది. భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కసరత్తు ఏప్రిల్ లో మొదలైనట్లుగా చెబుతున్నారు.
ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ ఊరించింది. అంటే.. గడిచిన 8 ఏళ్లలో దాదాపు 16 కోట్ల ఉద్యోగాల్ని ఇచ్చి ఉండాల్సింది. అందుకు భిన్నంగా ఇప్పుడు 10 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు సిద్ధం చేస్తున్న తీరుపై విమర్శలు విరుచుకుపడటం ఖాయమంటున్నారు. ఇందుకు తగ్గట్లే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడిన వెంటనే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.
ఇదిలా ఉంటే.. శాఖల వారీగా చూస్తే రైల్వేలు ఏడాది కాలంలో 1.48 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్లుగా వెల్లడించారు. అదే రీతిలో కేంద్రం పరిధిలోని వివిధ శాఖల్లో ఇదే తరహాలో ఉద్యోగాల భర్తీ సాగుతుందని చెబుతున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు.. మోడీ తన సొంత ప్లాన్ కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పంథాలో సాగుతున్నారా? అన్న సందేహం కలుగక మానదు. తాను అధికారంలో ఉన్న ఎనిమిదేళ్ల వ్యవధిలో ఉద్యోగ ప్రకటన అంశాన్ని ఈ మధ్యనే సీరియస్ గా తీసుకొని నోటిఫికేషన్లు విడుదల చేయటం తెలిసిందే.
తాజాగా మోడీ సర్కారు తీరు చూసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వ పంథానే ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. రానున్న 18 నెలలు అంటే.. దాదాపు 2023 చివరి వరకు ఉద్యోగాల భర్తీకి సమయం తీసుకోనున్నారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి. అంటే.. 10 లక్షల ఉద్యోగాల భర్తీ సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందుగా పూర్తి అయ్యేలా ప్లానింగ్ ఉండటాన్ని తప్పు పడుతున్నారు.
ఇదంతా ఎన్నికల కోసమే తప్పించి.. ఉద్యోగాల భర్తీ విషయంలో మోడీ సర్కారుకు కమిట్ మెంట్ లేదన్న మాట వినిపిస్తోంది. మరి.. కేసీఆర్ తరహాలో ప్రధాని మోడీ ఆలోచిస్తున్నట్లైయితే.. ఆయనకు ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయన్నది కాలమే సరిగ్గా సమాధానం చెబుతుందని చెప్పకతప్పదు.