Begin typing your search above and press return to search.
మేం తల్చుకుంటే అసలు ఇండియానే ఉండదు - ఫరూక్ అబ్దుల్లా
By: Tupaki Desk | 15 April 2019 12:38 PM GMTప్రధాని మోదీ - నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మధ్య మాటల యుద్ధం పెరిగింది. పరస్పరం ఆరోపణలు చేసుకోవడంలో ఇద్దరికి ఇద్దరూ ఎవ్వరూ తగ్గడం లేదు. రీసెంట్ గా ప్రధాని మోదీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఫరూక్ అబ్దుల్లా.
అసలు తాము తాము దేశాన్ని విడగొట్టాలని కోరుకుంటే.. హిందూస్థాన్ అనేదే ఉండదని అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీనగర్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఫరూక్ పాల్గొన్నారు. బాలాకోట్ పై వైమానిక దాడుల పేరుతో నరేంద్రమోడీ నాటకాలు ఆడుతున్నారని.. నరేంద్ర మోడీ ముక్కలవుతారేమో గానీ - తాము దేశాన్ని ముక్కలు కానివ్వబోమని అన్నారు ఫరూక్ అబ్దుల్లా. పాకిస్తాన్ లోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ధ్వంసం చేశామని చెప్పుకొంటున్న మోడీ.. దానికి సంబంధించిన ఏ ఒక్క సాక్ష్యాన్ని కూడా బహిర్గతం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం అంటే బాలాకోట్ లో చెట్లపై బాంబులు విసిరినంత సులభం కాదని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ ఎంత సేపు బాలాకోట్ పై వైమానిక దాడులు - సర్జికల్ స్ట్రైక్ అంటూ కథలు చెబుతున్నారని - దానికి కారణమైన పుల్వామా దాడుల గురించి ఎందుకు ప్రస్తావించరని అన్నారు.
ఇక అంతకుముందు ఫరూక్ అబ్దుల్లాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. దేశాన్ని విడగొట్టడానికి - కాశ్మీర్ ను తమ నుంచి వేరు చేయడానికి కొన్ని శక్తులు కుట్ర పన్నాయని, పాకిస్తాన్ తో మిలాఖాత్ అయ్యాయంటూ ఆరోపించారు. ఫరూక్ అబ్దుల్లా కుటుంబ రాజకీయాలు జమ్ముకశ్మీర్ ప్రజల మూడు తరాల భవిష్యత్తును నాశనం చేశాయని మోడీ ఆరోపించారు. వారికి రాజకీయ విశ్రాంతినిస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఫరూక్ కూడా మోదీకి తగిన స్థాయిలోనే కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి కాశ్మీర్ విషయంలో.. ప్రధాని మోదీ - నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఎవ్వరూ తగ్గడం లేదు.