Begin typing your search above and press return to search.
100 మంది ఎంపీలకు చీటీ చించేసినట్టే!
By: Tupaki Desk | 12 Jan 2018 5:05 AM GMTఇక్కడ ఏపీలో చంద్రబాబునాయుడు తన పార్టీకి చెందిన సిటింగ్ ఎమ్మెల్యేల్లో.. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటినుంచే ఓ గుబులు రేకెత్తిస్తున్నారు. ‘వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్లు ఉంటాయో లేదో తెలియదు.. మీ పనితీరే ప్రామాణికం. నేను చేయించే సర్వేల్లో ఎవరు వెనకబడి ఉన్నా సరే.. వారికి టికెట్లు ఇవ్వడం జరగదు. ఆ తర్వాత విచారించి లాభం లేదు. ముందే మీ పనితీరును చక్కదిద్దుకోండి. ’ అంటూ ఆయన పదేపదే హెచ్చరిస్తూ ఉంటారు.
అక్కడ భాజపాలో సారథి అమిత్ షా కూడా తమ పార్టీకి చెందిన ఎంపీలను ఇదే మాటలతో బెదిరిస్తున్నారు. అంతే కాదు.. అక్కడ ఏకంగా అప్పుడే జాబితాలు కూడా సిద్ధం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పుడే ఏ ఎంపీలు ఎలా పనిచేస్తున్నారో.. ఎవరికి టికెట్లు ఇవ్వాలో ఎవరికి తిరస్కరించాలో.. పనితీరును మదింపు వేసి.. వారి జాతకాలను పరిశీలించి.. జాబితాలను సిద్ధం చేసింది భాజపా అని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే దాదాపు వందమంది సిటింగ్ ఎంపీలకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు తిరస్కరించబోతున్నట్లు అమిత్ షా ముందే వారికి హింట్ ఇచ్చేశారట. వారి సేవలను పార్టీ మరో రకంగా ఉపయోగించుకోబోతున్నది అని కూడా.. ఆయన వారికి కాస్త ఊరడింపు మాటలు చెప్పేశారుట.
వచ్చే ఎన్నికలకు సంబంధించిన కసరత్తును అమిత్ షా అప్పుడే ప్రారంభించేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి సార్వత్రిక ఎన్నికలు ఇంకా ఎంత దూరంలో ఉన్నాయో ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే.. షెడ్యూలు ప్రకారం అయితే.. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి జరగాలి. అయితే కేంద్రం ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నట్లుగా కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కేంద్రం జమిలి ఎన్నికల ఆలోచన చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏ క్షణాన అయినా హటాత్తుగా ఎన్నికలు ముంచుకు వచ్చే అవకాశం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే కాబోలు.. అమిత్ షా ఇప్పటినుంచే అభ్యర్థుల ఎంపిక కసరత్తు పర్వాన్ని కూడా పూర్తి చేసేస్తున్నారు. అయినా.. 276 మంది ఎంపీలు ఆ పార్టీకి ఉండగా... ఏకంగా 100 మందికి చీటీ చించేయడం అంటే.. మూడోవంతుకు పైగా తిరస్కరించినట్టే. మోడీ హవాను ఎంతగా నమ్ముకున్నా పార్టీలో తిరుగుబాటు లేవకుండా ఉంటుందా..? అనే అంచనాలు కూడా సాగుతున్నాయి.