Begin typing your search above and press return to search.
సీఎంగా ఉద్దవ్ ప్రమాణస్వీకారానికి మోడీ,అమిత్ షా!
By: Tupaki Desk | 27 Nov 2019 5:30 AM GMTమహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి మరో రోజులో తెరపడబోతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి మహా రాజకీయాలు ... సినిమాలని తలదన్నే రీతిలో ముందుకు సాగాయి. ఊహించని ట్విస్టులతో గంటకొక విధంగా మారి మొత్తం దేశాన్నే తమ వైపు తిరిగి చూసేలా చేసాయి. ఇక నిర్ణయం అయిపోయింది తెల్లవారితే ప్రభుత్వ ఏర్పాటే తరువాయి అనుకున్న సమయంలో బీజేపీ వ్యూహం తో శివసేన , ఎన్సీపీ , కాంగ్రెస్ కి పెద్ద షాక్ ఇచ్చింది.
ఎన్సీపీ కీలక నేత అజిత్ పవర్ సహాయంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దమై ..బీజేపీ నేత ఫడ్నవిస్ సీఎం గా , అజిత్ పవర్ డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేసారు. అయితే ఆ తరువాత కూడా అంతే వేగంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఎన్సీపీ అధినేత శరద్ పవర్ మరోసారి చక్రం తిప్పి అజిత్ ని వెనక్కి రప్పించడంలో సఫలం కావడం .. బలనిరూపణకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో సీఎంగా ఫడ్నవిస్ రాజీనామా చేయడంతో ..కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయ్యింది. దీనితో ఫడ్నవిస్ మహారాష్ట్ర కి మూడు రోజుల 8గంటల ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు.
ఇక కాంగ్రెస్ మరియు ఎన్‌సిపి మహారాష్ట్రలో శివసేన భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని పనులని పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమం ముంబైలోని ఐకానిక్ శివాజీ పార్క్‌లో జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే మూడు పార్టీలు కలిసి సీఎం గా ఉద్దవ్ ని ప్రతిపాదించడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే రేపు రేపు సాయంత్రం 6.40 నిముషాలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ని పిలుస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఈ విషయంలో మాకు ఎటువంటి పట్టింపులు లేవని, ప్రధాని మోడీ, అమిత్ షా ను కూడా పిలుస్తామని బదులిచ్చారు. దీనితో రౌత్ వ్యాఖ్యలపై ఇప్పుడు అక్కడ చర్చలు నడుస్తున్నాయి.