Begin typing your search above and press return to search.
హైదరాబాద్ మీద మోడీషా స్పెషల్ ఫోకస్.. మూడ్రోజులు మకాం
By: Tupaki Desk | 1 Jun 2022 5:30 PM GMTఎనిమిదేళ్ల మోడీ పాలన తర్వాత ఆయన్ను దగ్గరగా గమనించినోళ్లకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. తాము ఏదైనా రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకొని.. అక్కడ కాషాయజెండా ఎగరాలని డిసైడ్ అయితే.. చాలు అదే పనిగా ఆ రాష్ట్రానికి వెళ్లటం ఒక అలవాటన్న సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్ మొదలు ఈ మధ్యనే ముగిసిన పశ్చిమ బెంగాల్ వరకు ఇదే సూత్రాన్ని అమలు చేస్తుంటారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే.. తెలంగాణ మీద అమిత్ షాలు గట్టి ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది.
అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మొదట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే యోచనలో గులాబీ బాస్ ఉన్నట్లుగా చెప్పటం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో తమ సత్తా చాటటమే కాదు.. తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలన్న కసితో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో హైదరాబాద్ మీద ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు మోడీషాలు. గడిచిన కొద్ది రోజులుగా చూస్తే.. అమిత్ షా.. నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సహా తెలంగాణకు వస్తుండటం కనిపిస్తుంది. ఈ మధ్యన ముగిసిన సమతా విగ్రహావిష్కరణకు వచ్చిన ఆయన.. కొద్ది రోజులకే ఐఎస్ బీలో జరిగే స్నాతకోత్సవానికి హాజరుకావటం తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జులై మూడో వారంలో పదిహేనో తారీఖు తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరగనున్నట్లుగా తెలుస్తోంది. మూడు రోజులు పాటు సాగే ఈ సమావేశాల కోసం దేశ వ్యాప్తంగా ఉంన్న బీజేపీ నేతలు హైదరాబాద్ కు రానున్నారు. అంతేనా.. మోడీషాలు సైతం ఆ మూడ్రోజులు హైదరాబాద్ లోనే మకాం వేయనున్నారు.
దాదాపు 300 - 500 మంది వరకు కీలక కమలనాథులు హైదరాబాద్ కు రానున్నారు. తాజా నిర్ణయాన్ని చూస్తే.. తెలంగాణ మీదా.. హైదరాబాద్మహానగరం మీద బీజేపీ అధినాయకత్వం ఎంత ఫోకస్ గా ఉందన్న విషయం అర్థమవుతుంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కాషాయ జెండా ఎగరాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా హైదరాబాద్ ను ఎంపిక చేసుకున్నట్లుగా చెప్పక తప్పదు.