Begin typing your search above and press return to search.

క్యూలో నిలుచొని ఓటేసిన మోడీ.. జైట్లీ!

By:  Tupaki Desk   |   14 Dec 2017 9:29 AM GMT
క్యూలో నిలుచొని ఓటేసిన మోడీ.. జైట్లీ!
X
రాజ‌కీయాల్లో దూకుడు విష‌యంతో త‌న‌కు తానే సాటి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌ధాని మోడీ కొన్ని విష‌యాల్లో ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఏ మాత్రం దూకుడు.. అంత‌కు మించిన తొంద‌ర‌పాటును అస్స‌లు ప్ర‌ద‌ర్శించ‌రు. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో రిజిస్ట‌ర్ అయ్యే విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకునే ప్ర‌ధాని.. తాజాగా జ‌రుగుతున్న రెండో ద‌శ పోలింగ్ విష‌యంలోనూ అలాంటి తీరునే ప్ర‌ద‌ర్శించారు.

కీల‌క‌మైన గుజ‌రాత్ రెండో ద‌శ పోలింగ్ లో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేష‌న్‌ కు వ‌చ్చారు ప్రధాని మోడీ. ఈ రోజు (గురువారం) ఉద‌యం ముంబ‌యిలో ఎన్‌ ఎస్ కల్వరిని జాతికి అంకితం చేశారు. ఆ కార్య‌క్ర‌మం నుంచి నేరుగా అహ్మదాబాద్‌ కు చేరుకున్నారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల ప్రాంతంలో స‌బ‌ర్మ‌తీలోని రాణిప్ ప్రాంతంలోని 115వ పోలింగ్‌ కేంద్రంలో మోడీ ఓటేశారు.

ఓటు వేసేందుకు పోలింగ్ స్టేష‌న్‌ కు వ‌చ్చిన మోడీ.. ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించారు. పోలింగ్ స్టేష‌న్ ద‌గ్గ‌ర ఓటు వేయ‌టానికి వ‌చ్చిన మిగిలిన ఓట‌ర్ల తో పాటు క్యూలో నిలుచున్న ఆయ‌న త‌న వంతు వ‌చ్చిన‌ప్పుడు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేశారు. దేశ ప్ర‌ధానిగా ఉన్న‌ప్ప‌టికి తాను సైతం సామాన్యుడ్నే అన్న రీతిలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు.

మోడీని చూసేందుకు పోలింగ్ స్టేష‌న్ చుట్టుప‌క్క‌ల వారంతా భ‌వ‌నాలు ఎక్కారు. ఆయ‌న్ను చూసేందుకు అక్క‌డి వారు ఎగ‌బ‌డ్డారు. మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేశారు. త‌న‌ను పిలుస్తున్న వారంద‌రిని సంతోష‌పెట్టేలా మోడీ చేతులు ఊపుతూ అభివాదం చేశారు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వెళ్లిన మోడీకి.. ఎలాంటి స్వాగ‌తం చెప్ప‌లేదు. కొంద‌రు పోలింగ్ అధికారులు న‌వ్వుతూ త‌మ ప‌ని చేశారే కానీ నిల‌బ‌డ‌లేదు. మ‌రికొంద‌రు మాత్రం ఆయ‌న లోప‌ల‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ నుంచి తిరిగి వెళ్లిపోయే వ‌ర‌కూ నిల‌బ‌డే ఉన్నారు.

త‌న ఓట‌రు స్లిప్ ఇచ్చిన ప్ర‌ధానికి ఈవీఎం ఎక్క‌డ ఉందో చేత్తో చూపించారు. ఆయ‌న త‌న ఓటు వేసి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. త‌న ఓటు వేసే ప్ర‌క్రియ‌ను వీలైనంత సింఫుల్ గా పూర్తిచేశారు. మ‌రో కేంద్ర‌మంత్రి.. మోడీకి అత్యంత స‌న్నిహితుడైన అరుణ్ జైట్లీ సైతం క్యూ లైన్లో నిల‌బ‌డి ఓటు వేశారు. ఇక పాటిదార్ హ‌క్కుల కోసం పోరాడుతున్న హార్దిక్ ప‌టేల్ వీరంగం ప్రాంతంలో ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు.