Begin typing your search above and press return to search.

మోడీ బ్యాచ్ కి షాకిచ్చిన ఆ 2 సర్వేలు!

By:  Tupaki Desk   |   25 Jan 2019 4:45 AM GMT
మోడీ బ్యాచ్ కి షాకిచ్చిన ఆ 2 సర్వేలు!
X
ఐదేళ్ల‌కే మోడీ మేజిక్ మాయం కానుందా? దేశ ప్ర‌జ‌లు పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని మోడీ వ‌మ్ము చేశారా? ఇటీవ‌ల కాలంలో మ‌రెవ‌రికీ ద‌క్క‌నంత ఆద‌ర‌ణ పొందిన మోడీని.. దేశ ప్ర‌జ‌లు త్వ‌ర‌లో తిర‌స్క‌రిస్తున్నారా? అంటే అవున‌న్న మాట‌ను తాజాగా వెల్ల‌డించిన రెండు స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లుగా పేరున్న ఇండియా టుడే.. కార్వీ - ఏబీపీ-సీఓట‌ర్ సంస్థ‌లు క‌లిసి నిర్వ‌హించిన స‌ర్వే ఫ‌లితాల్ని వెల్ల‌డించారు.

షాకింగ్ విష‌యం ఏమంటే.. మోడీని దేశ ప్ర‌జ‌లు రిజెక్ట్ చేయ‌ట‌మే కాదు.. ఒక‌వేళ‌ కేసీఆర్‌.. న‌వీన్ ప‌ట్నాయ‌క్.. జ‌గ‌న్‌.. ప‌ళ‌నిస్వామి లాంటి వారు త‌మ పూర్తి మ‌ద్ద‌తును ప్ర‌క‌టించినా ఎన్డీయే మ‌ళ్లీ అధికారంలోకి రావ‌టం సాధ్యం కాద‌ని తేలింది. ఈసారి హంగ్ మూడ్ త‌ప్ప‌ద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించింది. మోడీ మీద పెరిగిన వ్య‌తిరేక‌త క‌మ‌లం పార్టీ కొంప ముంచ‌టం ఖాయ‌మ‌ని.. భారీగా సీట్ల‌నున‌ష్ట‌పోనుంద‌ని పేర్కొంది. క‌మ‌ల వికాసాన్ని అడ్డుకోవ‌టంలో యూపీలో ఎస్పీ.. బీఎస్పీతో ఏర్ప‌డిన కూట‌మి కొంప ముంచ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేస్తున్నారు. ఒక‌వేళ‌.. మాయ‌వ‌తి.. అఖిలేశ్‌.. మ‌మ‌తా బెన‌ర్జీలు కానీ యూపీఏకు మ‌ద్ద‌తు ఇస్తే మాత్రం యూపీఏ స‌ర్కారు ప‌వ‌ర్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు.

స‌ర్వే చేసిన రెండు సంస్థ‌లు ఏం చెప్పాయ‌న్న విష‌యంలోకి వెళితే.. సీ ఓట‌ర్ లెక్క ప్ర‌కారం ఎన్డీయేకి 233 స్థానాలు.. యూపీఏకు 167 స్థానాలు.. ఇత‌ర పార్టీలు 143 స్థానాల్లో విజ‌యం సాధిస్తాయ‌ని పేర్కొన్నారు. ఎన్డీయేకి జ‌త‌గా టీఆర్ఎస్‌.. వైఎస్సార్ కాంగ్రెస్‌.. బీజేడీ క‌లిసినా 278 స్థానాలు మాత్ర‌మే ల‌భిస్తాయ‌ని.. అదే స‌మ‌యంలో యూపీఏకు ఎస్పీ.. బీఎస్పీలు మ‌ద్ద‌తు ఇచ్చినా ఆ కూట‌మికి ల‌భించేది 257 స్థానాలేన‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. మోడీకి మ‌ద్ద‌తు ఇచ్చే విష‌యంలో అన్నాడీఎంకే.. ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు సైతం మ‌ద్ద‌తు ఇచ్చినా ఒక్క స్థానం తేడాతో మేజిక్ మార్క్ కు దూరంగా ఉంటుంద‌ని చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 97 లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో 13,179 మందిని స‌ర్వే చేసి ఫ‌లితాల్ని విడుద‌ల చేశారు. ఇక‌.. మూడ్ ఆఫ్ ద నేష‌న్ పేరుతో ఇండియా టుడే నిర్వ‌హించిన స‌ర్వేలో మాత్రం బీజేపీకి 237 స్థానాలు ల‌భిస్తాయ‌ని పేర్కొంది. బీజేపీకి ఇంత భారీ న‌ష్టం జ‌ర‌గటానికి కార‌ణం 2014లో పోలిస్తే ఈసారి జ‌రిగే ఎన్నిక‌ల్లో బీజేపీ ఏకంగా 99 స్థానాల్లో ఓట‌మి చెంద‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. 2014లో కేవ‌లం 60 స్థానాల్ని మాత్ర‌మే సొంతం చేసుకున్న యూపీఏ ఈసారి మాత్రం త‌న బ‌లాన్ని 166కు పెంచుకుంటుంద‌ని స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డించాయి.

యూపీఏ 33 శాతం ఓట్ల‌ను సొంతం చేసుకుంటే ఎన్డీయే మాత్రం 35 శాతం ఓట్ల‌ను ద‌క్కించుకున్నా ప‌వ‌ర్ మాత్రం అంద‌ని ద్రాక్ష‌గా మిగులుతుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.