Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ డైలాగ్‌ రియ‌ల్ గా అదిరేలా చేసిందే

By:  Tupaki Desk   |   26 Dec 2017 4:46 PM GMT
ప‌వ‌న్ డైలాగ్‌ రియ‌ల్ గా అదిరేలా చేసిందే
X
రీల్ డైలాగులు రియ‌ల్ కు ఏ మాత్రం సూట్ కావు. కానీ.. తాజాగా రెండు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు చూస్తే.. రీల్ డైలాగులు ప‌ర్ ఫెక్ట్ గా వ‌ర్క్ వుట్ అయిన‌ట్లుగా చెప్పాలి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అత్తారింటికి దారేది.

ఈ మూవీలో ఒక డైలాగుకు విశేష ప్రేక్ష‌క స్పంద‌న వ‌చ్చింది. లాస్ట్ పంచ్ మ‌న‌దైతే.. ఆ కిక్కే వేర‌ప్పా అన్న డైలాగ్ ప్రేక్ష‌కుల్నే కాదు.. ఇదే డైలాగును రియ‌ల్ గా అమ‌లు చేస్తే.. వ‌చ్చే పొలిటిక‌ల్ రిజ‌ల్ట్ అదిరిపోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొన్న‌టికి మొన్న ముగిసిన గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మొద‌టి ద‌శ పోలింగ్ ముగిసిన త‌ర్వాత అధికార బీజేపీకి ప్ర‌తికూల ఫ‌లితం వ‌చ్చేలా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది.

అంతే.. మోడీ రంగంలోకి దిగ‌టం.. ప‌వ‌న్ అత్తారింటికి దారేది మూవీలోని లాస్ట్ పంచ్ డైలాగ్ ను ఇట్టే అమ‌లు చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. మొద‌టిద‌శ పోలింగ్ కు ముందు మాట్లాడిన దానికి ఏ మాత్రం సంబంధం లేని రీతిలో.. రెండో ద‌శ పోలింగ్ కు ముందు మోడీ మాట‌లు మారిపోయాయి. త‌న‌ను అడ్డు తొలిగించుకునేందుకు పాక్ తో సంప్ర‌దింపులు మొద‌లు పెట్టార‌న్న అర్థం వ‌చ్చేలా వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు.. త‌న‌ను నీచ్ అంటూ చేసిన రాజ‌కీయ విమ‌ర్శ గుజ‌రాతీల్ని అవ‌మానించేలా ఉంద‌న్న‌ట్లుగా ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అంతే.. అప్ప‌టివ‌ర‌కూ మోడీని విమ‌ర్శించే వారు సైతం.. గుజ‌రాత్ సెంటిమెంట్ తో ఒక్క‌సారిగా త‌మ మ‌న‌సుల్ని మార్చుకున్నారు. లాస్ట్ పంచ్ గా మోడీ వేసిన ఎత్తుకు తుది ఫ‌లితం మారిపోవ‌ట‌మే కాదు.. 22 ఏళ్ల నాన్ స్టాప్ పాల‌న త‌ర్వాత మ‌రో ఐదేళ్లు పాలించే అవ‌కాశం బీజేపీకి ద‌క్కింది.

ఇదిలా ఉంటే.. ఆదివారం వెల్ల‌డైన త‌మిళ‌నాడు ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లోనూ ప‌వ‌న్ సినిమాలో డైలాగుకు త‌గ్గ‌ట్లే చిన్న‌మ్మ వ‌ర్గం పావులు క‌దిపింద‌ని చెప్పాలి. పోటాపోటీగా సాగుతున్న ఎన్నిక‌ను త‌న‌కు అనుకూలంగా మార్చేందుకు ఆఖ‌రి అస్త్రంగా అమ్మ ఆసుప‌త్రి వీడియోను విడుద‌ల చేశారు. అప్ప‌టికే.. విశాల్ నామినేష‌న్ తిర‌స్కృతితో పాటు.. పాల‌నా ప‌రంగా చేస్తున్న త‌ప్పుల‌తో పాటు.. మోడీతో తెర వెనుక ఉన్న రిలేష‌న్ త‌మిళ ఓట‌ర్ల‌కు ఎక్క‌డో మండేలా చేశాయి. దీనికి తోడు పోలింగ్ కు ఒక్క‌రోజు ముందు ఆసుప‌త్రిలో అమ్మ ఉన్న వీడియో విడుద‌ల కావ‌టం.. అప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన విష ప్ర‌చారానికి భిన్నంగా వీడియో ఉండ‌టంతో ఆర్కే న‌గ‌ర్ ఓట‌ర్ల మైండ్ సెట్ మీద ప్ర‌భావం చూపించింది. దీంతో.. అమ్మ వీడియోతో దిన‌క‌ర‌న్ ఇచ్చిన లాస్ట్ పంచ్ కు పార్టీలు తేరుకునే లోపే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోవ‌ట‌మే కాదు.. సంచ‌ల‌న ఫ‌లితం న‌మోదైంది. ప‌వ‌న్ లాస్ట్ పంచ్ డైలాగును ఈ రెండు సంద‌ర్భాల్లోనూ స‌మ‌ర్థంగా వినియోగించిన వారే అంతిమ విజేత‌లుగా నిలిచార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.