Begin typing your search above and press return to search.
ట్రంప్ మోడీ కలిసి..రామాయణాన్ని వీక్షించారు
By: Tupaki Desk | 13 Nov 2017 3:15 PM GMTఔను నిజమే. మన రామాయాణాన్ని అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ - మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసి వీక్షించారు. వీళ్లిద్దరే కాదు...చైనా ప్రధాని లీ కెఖియాంగ్ - జపాన్ ప్రధాని షింజో అబే కూడా ఇందులో జతకూడారు. ఇలాంటి విశిష్ట కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఆసియాన్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి ఫిలిప్పీన్స్ లో ఈ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.
అయితే అంత పెద్ద సమావేశంలో ఇదెలా సాధ్యమైందనే సందేహానికి సమాధానం కూడా ఆసక్తికరం. ఫిలిప్పీన్స్ భాషలో మన రామాయణాన్ని `మహారదియా లవాన` అని పిలుస్తారు. రెండు రోజులు జరిగే ఆసియాన్ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా `మహారదియా లవాన`ను ప్రదర్శించారు. దీనినే ఈ ప్రముఖ నేతలు వీక్షించారు. మరో ఆసక్తికరమైన పరిణామం ఏమంటే...మన రామాయణ గాథను ఆధారం చేసుకుని ఫిలిప్పీన్స్ వాసులు 'సింగ్ కిల్' అనే నృత్యరూపకాన్ని రూపొందించుకున్నారు. కాగా, మరో విశేషం కూడా ఈ సందర్భంగా చోటుచేసుకుంది. ప్రధాని మోదీ - అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లతోపాటు విందుకు హాజరైన వివిధ దేశాల అధినేతలు.. ఫిలిపినో డిజైనర్ అల్బర్ట్ ఆండ్రాడ రూపొందించిన ఒకే తరహా బారోగ్ టాగలాగ్ దుస్తులను ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. పలువురు నేతలతో సమావేశమైన దృశ్యాలను ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఇదిలాఉండగా....ఇండో - పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకునేందుకు భద్రతా రంగంలో పరస్పర సహకారానికి చతుర్భుజ కూటమి ఏర్పాటు చేయాలని అమెరికా-భారత్-జపాన్-ఆస్ట్రేలియా నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు ఆసియాన్ సదస్సు సందర్భంగా నాలుగు దేశాల అధికారుల మధ్య జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరింది. ప్రపంచ దేశాల దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సమగ్ర ఇండో - పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుతమైనదిగా తీర్చిదిద్దేందుకు ఆ దేశాల మధ్య అంగీకారం కుదిరింది అని భారత్ విదేశాంగశాఖ తెలిపింది. ఈ నాలుగు దేశాలు స్వేచ్ఛా వాణిజ్యం పురోభివృద్ధితోపాటు రక్షణ రంగంలో పరస్పరం సహకరించుకోనున్నాయి.