Begin typing your search above and press return to search.
మోడీ మరియు రాహుల్ : దళిత గురు కీర్తన ఎందుకోసం అంటే?
By: Tupaki Desk | 18 Feb 2022 3:58 AM GMTరెండు రాష్ట్రాలను ప్రభావితం చేసే గురువు, రాజకీయ పార్టీలకు కూడా ఎంతో అవసరం అయ్యారు. గురు రవిదాస్ పేరుతో ఏటా జరిగే జయంతి ఉత్సవాలకు వారణాసి కేంద్రంగా జరిగే ఉత్సవాలకు మోడీ వెళ్లారు. రాహుల్ కూడా వెళ్లారు.ఈ విధంగా వెళ్లడంతోనే ఆ ఇద్దరూ పతాక శీర్షికల్లో నిలిచారు.తమని తాము మరింత ప్రత్యేకంగా మార్చుకున్నారు లేదా మలుచుకున్నారు.
సంత్ రవిదాస్ అటు ఉత్తరప్రదేశ్ నీ ఇటు పంజాబ్ నీ ఏక కాలంలో ప్రభావితం చేయగల గురువు. వారి బోధనలు రెండు రాష్ట్రాలనూ పాటించేవారు ఉన్నారు.ముఖ్యంగా దళితులకు ఆయన ఆధ్యాత్మిక గురువు.వెయ్యి కోట్ల ఆలయాలను కోరుకోని గురువు.కానీ ప్రధాని మోడీ మాత్రం ఆయన పేరిట ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మాత్రం మాట ఇచ్చి వచ్చారు.ఇది తన పూర్వ జన్మ సుకృతం అని అర్థం ధ్వనించేలా చెప్పి మరీ వచ్చారు.
రవిదాస్ గురు ఎప్పటి నుంచో ఈ ప్రాంతాలలో పేరున్న మత గురువు.రవి దాసీయా అన్న మతాన్ని ప్రచారం చేసిన వారు. చర్మకారుల కుటుంబంలో పుట్టి ఏమీ కోరుకోని స్థితి బతుకు నెట్టకు వచ్చిన వారు.చిన్ననాట నుంచి ఎదుర్కొన్న అవమానం అంటరాని తనం వీటన్నింటినీ దాటుకుని వాటికో అక్షర రూపం కవిత్వీకరించి సామాజిక రుగ్మతలను ప్రశ్నించారు.
నాటి పరిస్థితులకు ఎదురు నిలిచారు.వారి భావనలు బోధనల ఫలితంగా దేశ విదేశాల్లో కూడా వారి ఆలయాలు ఉన్నాయి.ముఖ్యంగాపంజాబ్ సిక్కుల సాయంతో దళితులు వారి ఆలయాలను నిర్మించడం అన్నది ఓ గొప్ప విశేషం అని ప్రచురణ మాధ్యమాలు వెల్లడి చేస్తున్నాయి.ముఖ్యంగా పంజాబ్ లో ఉన్న దళితులకు ఆయన ఆరాధ్య గురువు.ఇక్కడున్న 32శాతం దళితులనుప్రభావితం చేయగలిగే విధంగా నాయకులు తమ ఎత్తుగడలను వేస్తున్నారు.అందుకే వారి ఆధ్యాత్మిక గురువును అడ్డం పెట్టుకునిరాజకీయం నడిపేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
గతంలో పంజాబ్ లో బీఎస్పీ ఇదేవిధంగా ప్రయత్నించి సఫలీకృతంఅయిందని ప్రధాన మీడియా చెబుతోంది.అంతేకాదు రవిదాస్ జయంతి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకునే ఈ నెల 14న జరగాల్సిన పంజాబ్ ఎన్నికలను 20కి వాయిదా వేసింది కేంద్ర ఎన్నికల సంఘం.అంతటి ప్రాధాన్యం ఉన్న మతగురువు కావడంతోఅటు యూపీ కానీఇటు పంజాబ్ కానీ ఆయన నామ స్మరణకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది అని,
ఆ విధంగా దళితులు ఆయనను ఆరాధ్య దైవంగా భావిస్తారు అని ఆయన రాసిన కీర్తనలను పాడుకునేందుకు ఇష్టపడతారని తెలుస్తోంది.వీటిని దృష్టిలో ఉంచుకునే నిన్నటివేళ అటు మోడీ కానీ ఇటు రాహుల్ కానీ కరోల్ బాగ్ లో ఒకరు వారణాసి లో ఒకరు సందడి చేశారు. ఓట్ల రాజకీయాలను ప్రభావితం చేసేందుకు తమవంతు ప్రయత్నాలు చేశారు.వాటి ఫలితాల కోసం ఆ ఇద్దరు నాయకులూ ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు!