Begin typing your search above and press return to search.
ఒకే వేదికపైన మోడీ.. స్టాలిన్.. అందరి నోట వినిపించిన మాట అదేనట!
By: Tupaki Desk | 29 July 2022 7:30 AM GMTభిన్న ధ్రువాలు ఒకే వేదిక మీద కొలువు తీరితే ఎలా ఉంటుంది? చెన్నైలో ప్రారంభమైన చెస్ ఒలింపియాడ్ ప్రారంభ వేడుక మాదిరి ఉంటుందని చెప్పాలి. రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోడీ.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భిన్న ధ్రువాలు. ఒకరి సిద్ధాంతానికి మరొకరి సిద్ధాంతంలో అస్సలు ఇమడదు. ఆ మాటకు వస్తే.. కేంద్రంలోని మోడీ సర్కారును విమర్శించాల్సి వచ్చినప్పుడు.. తప్పులు ఎత్తి చూపించాల్సి వచ్చిన సందర్భంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వ్యాఖ్యలు చేసే అతి కొద్ది మంది ముఖ్యమంత్రుల్లో స్టాలిన్ ఒకరు.
అలా అని దేశ ప్రధానమంత్రి విధానాలు తనకు నచ్చవన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి కాకుండా.. ఆయనతో కలిసి వేదికను పంచుకున్నారు.ఈ సందర్భంగా వేడుకకు హాజరైన వారు.. ఆ ప్రోగ్రాంను టీవీల్లో చూసినోళ్లలో చాలామంది నోటి నుంచి వచ్చిన మాట.. ఈ ఇద్దరి వస్త్రధారణ. దేశ ప్రధానుల్లో వస్త్రధారణతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రధాని ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీనే.
ఏ ప్రాంతానికి వెళితే.. ఆ ప్రాంతానికి సంబంధించిన ఆహార్యంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అన్నింటికి మించి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ.. ఆ అంశంలో ఎమోషనల్ కనెక్టు ఎక్కువగా ఉంటే తమిళనాడుకు వెళ్లే ప్రతి సందర్భంలోనే పంచెకట్టుతోనే మోడీ వెళ్లటం కనిపిస్తుంది. తాజాగా అదే తీరును ప్రదర్శించిన ఆయన.. తెల్లటి దుస్తులతో మెరిసిపోయారు. మోడీ మార్కు ఏమంటే.. మెడలోఆయన వేసుకున్నకండువా. అది చదరంగపు బల్ల మీద తెలుపు.. నలుపు గడుల మాదిరి కండువాను ఆయన వేసుకోవటం అందరిని ఆకర్షించింది.
ఇక.. సీఎం స్టాలిన్ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అందరు తమిళుల మాదిరే ఆయనసంప్రదాయ దుస్తుల్ని ధరించారు. బంగారు వర్ణంతో మెరిసిపోయే చొక్కాతో పాటు.. భుజానికి వేసుకున్న సంప్రదాయ కండువాతో మెరిసిపోయారు.
వీరిద్దరిని చూసినప్పుడు సంప్రదాయాల్ని పాటించే విషయంలో ఈ ఇద్దరు నేతలు ఒకొరికొకరు అస్సలు తగ్గరనే చెప్పాలి. ఇదే విషయాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చూసినప్పుడు.. సంప్రదాయ దుస్తుల్లో అతి తక్కువగా దర్శనమిస్తుంటారు.
తాజాగా చెన్నైలో మొదలైన చెస్ ఒలింపియాడ్ తరహాలో పెద్ద కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ జరిగి ఉంటే.. వేదిక మీద సంప్రదాయ దుస్తుల్లో మాత్రం తెలుగు ముఖ్యమంత్రులు కనిపించే అవకాశం చాలా తక్కువని చెప్పక తప్పదు. తెలుగుదనం కనిపించేలా తెలుగు ముఖ్యమంత్రులు తమ వస్త్రధారణను ఎప్పుడు మారుస్తారో? అలాంటి ముఖ్యమంత్రి ఎప్పటికైనా తెలుగు రాష్ట్రాలకు వస్తాడా? అన్నది ఆసక్తికరప్రశ్నగా చెప్పక తప్పదు.