Begin typing your search above and press return to search.

వీడ్కోలు వేళ వెంకయ్య, మోడీ ఎమోషనల్?

By:  Tupaki Desk   |   8 Aug 2022 10:30 AM GMT
వీడ్కోలు వేళ వెంకయ్య, మోడీ ఎమోషనల్?
X
వెంకయ్య వీడ్కోలు సభలో అటు మోడీ.. ఇటు ఉపరాష్ట్రపతి ఎమోషనల్ కు గురయ్యారు. వెంకయ్య పనితీరు ఎందరికో స్ఫూర్తిదాయకమంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. వెంకయ్యతో భుజం కలిపి పనిచేసే అదృష్టం దక్కిందని పొగడ్తలు కురిపించారు. ఓవైపు రిటైర్ మెంట్.. మరో వైపు పొగిడేస్తుంటే వెంకయ్య లో ఉద్వేగం తన్నుకొచ్చింది.

వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవి నుంచి ఈనెల 10వ తేదీన దిగిపోనున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాజ్యసభలో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరై మాట్లాడారు. ఇది ఉద్వేగభరితమైన క్షణమని అన్నారు. పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వెంకయ్యకు మోడీ అభినందనలు తెలిపారు.

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్యనాయుడు బీజేపీ అధ్యక్షుడు సహా అనేక పదవులు చేపట్టారని కొనియాడారు.యువ ఎంపీలను వెంకయ్య ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. వెంకయ్య కొత్తతరంతో మమేకమయ్యారని మోడీ పేర్కొన్నారు.

ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా సభా నాయకుడిగా మోడీ సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారని మోడీ ప్రశంసించాడు. ఏ పదవిలో ఉన్నా అంకిత భావంతో పనిచేశాడని కొనియాడారు. తన బాధ్యతలను ఎప్పుడూ బరువుగా భావించలేదన్నారు. వెంకయ్య పని విధానం, ఎంతో స్ఫూర్తిదాయం అంటూ కొనియాడారు. ఆయన శ్రద్ధ, బాధ్యత ప్రతీ ఒక్కరికి ఆదర్శం అని ప్రశంసించారు. సమాజం, ప్రజాస్వామ్యం ఆయన్నుంచి చాలా నేర్చుకోవాలని మోడీ ప్రశంసించారు.

ఇక వెంకయ్యలోని చతరుతను మోడీ ప్రస్తావించాడు. ఏకవ్యాఖ్య సంభోధనలు గురించి సెటైర్ వేశారు. అవి చాలా చమత్కారంగా ఉంటాయని తెలిపారు. కొన్ని సార్లు అవే విజయ సూత్రాలుగా మారాయని అభివర్ణించారు.

ఇక వెంకయ్య శ్రద్ధ, బాధ్యత, ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని కొనియాడారు. సమాజం, ప్రజాస్వామ్యం ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి అని మోడీ ప్రశంసించారు. రాజ్యసభ ఎంపీల హాజరు 70శాతానికి పెరగడం వెనుక వెంకయ్య కృషి ఉందని తెలిపారు.

దిగిపోతున్న వెంకయ్య మాత్రం మోడీ మాటలను తీక్షణంగా వింటూ ఉద్వేగానికి గురవుతూ కాస్త ఎమోషనల్ గా కనిపించారు. మోడీ మాటలో సైతం కాస్త ఆ ఉద్విగ్నత నెలకొంది.