Begin typing your search above and press return to search.
మోడీతో బాబు..డేట్ ఫిక్స్ అయింది
By: Tupaki Desk | 17 Aug 2015 12:34 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమావేశం కానున్న తేదీ ఖరారయింది. ఈనెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో చంద్రబాబు మోడీతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం అపాయింట్ మెంట్ ఖరారు చేసిటన్లు ఏపీ అధికార వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ సహా ఏ రాష్ర్టానికి ప్రత్యేక హోదాలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటులో తేల్చిచెప్పిన తర్వాత ఒక్కసారిగా రాజకీయవాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్ని పార్టీలు చంద్రబాబు లక్ష్యంగా ఆరోపణలు గుప్పించాయి. ధర్నాలు, ఏపీ బంద్ వంటి పిలుపులు ఇచ్చాయి. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం ప్రత్యేకం లేదన్న సంకేతాలు ఇచ్చిన నేపథ్యం మరింత ఇబ్బందిని కలిగించింది. ఈ క్రమంలో ఏపీ సమస్యలను ప్రస్తావించేందుకు ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేసేందుకు మోడీని కలిసేందుకు చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరారు.
విభజన అనంతరం ఏపీ ఎదుర్కుంటున్న సమస్యలు, విభజన చట్టంలోని హామీలు, సెక్షన్ 8 తదితర అంశాలు ప్రధానమంత్రి తో చంద్రబాబు సమావేశం సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.