Begin typing your search above and press return to search.

మోడీ రాక స‌రే.. ఏపీ నేత‌లు గ‌ళం విప్పుతారా?

By:  Tupaki Desk   |   11 Nov 2022 7:49 AM GMT
మోడీ రాక స‌రే.. ఏపీ నేత‌లు గ‌ళం విప్పుతారా?
X
2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. రెండోసారి ఏపీకి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఏపీకి వ‌స్తున్నారు. ఈ ఏడాది మొద‌ట్లో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు వ‌చ్చిన ప్ర‌ధాని ద‌రిమిలా ఇప్పుడు విశాఖ‌కు వ‌స్తున్నారు. ఈ సంద‌ర్భంగా సుమారు 10 వేల కోట్ల రూపాయ‌ల అభివృద్ధి ప‌నుల‌కు ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అయితే, ఇప్పుడు కూడా విశాఖ రైల్వేజోన్ వంటి కీల‌క ప్ర‌తిపాద‌న‌ను ఆయ‌న ప‌క్క‌న పెట్టారు.

మ‌రి.. దీనిపై అటు ప్ర‌తిప‌క్షాలు కానీ.. ఇటు అధికర పార్టీ వైసీపీ కానీ.. మౌనంగానే ఉన్నాయి. పోనీ, కీల‌క మైన అంశాల‌పై అయినా ఆయా పార్టీలు పెద‌వి విప్పుతాయా? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. ఎందుకంటే, మ‌రో ఏడాది న్న‌ర‌లో విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న వివిధ అంశాల‌కు సంబంధించిన ప‌దేళ్ల గ‌డువు పూర్త‌వుతోం ది. ప్ర‌త్యేక హోదా నుంచి ప‌లు కీల‌క ప్ర‌తిపాద‌న‌ల‌కు విభ‌జ‌న‌చ‌ట్టంలో ప‌దేళ్ల గ‌డువు మాత్ర‌మే ప్ర‌తిపా దించారు. అంటే.. పదేళ్ల‌లో వాటిని క‌నుక చేసుకోని ప‌క్షంలో ఇక‌, వాటి గురించి ప్ర‌స్తావించే అవ‌కాశం కూడా ఉండ‌దు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మోడీ ఎలానూ వ‌స్తున్నారు కాబ‌ట్టి ఆయా అంశాల‌ను ఏ రాజ‌కీయ ప‌క్ష‌మైన ప్ర‌స్తావిస్తుందా? అని ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. ఇటు అధికార పార్టీ కేంద్రంతో న‌ర్మ‌గ‌ర్భ రాజ‌కీయా లు.. స్నేహాలు చేస్తున్న ద‌రిమిలా ఈ పార్టీపై ప్ర‌జ‌లు ఎక్కువ‌గానే ఆశ‌లు పెట్టుకున్నారు.

కానీ వైసీపీ నాయ‌కులు మాత్రం ప్ర‌ధానిని తీసుకురావ‌డ‌మే గొప్ప అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు త‌ప్ప స‌మ‌స్య‌ల‌పై దృష్టిపెట్టిన పాపాన పోవ‌డం లేదనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని త‌పిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌మిత్థంగా మేం ఈ డిమాండ్ల‌ను ప్ర‌ధాని ముందు పెడుతున్నాం అని కానీ, పెడ‌తామ‌ని కానీ ప్ర‌క‌టించ‌లేదు. అస‌లు ప్ర‌ధాన మంత్రి రాక‌పై టీడీపీ నేత‌లు తెలియ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప్ర‌ధాని స్వ‌యంగా ఆహ్వానించార‌ని, ఆయ‌న విశాఖ‌కు వ‌స్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఆయ‌న వ్యూహం కేవ‌లం వైసీపీపై విమ‌ర్శ‌లు చేసేందుకు, ఫిర్యాదులు అందించేందుకే ప‌రిమితం అవుతారా? లేక రాష్ట్రానికి రావాల్సిన కీల‌క‌మైన ప్రాజెక్టుల‌పై దృష్టి పెడ‌తారా? అనేది ఆస‌క్తిగా మారింది. చూడాలి ఏం చేస్తారో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.