Begin typing your search above and press return to search.
మోడీ రాక.. బేగంపేట ఎయిర్ పోర్టుకెళ్లిన కేసీఆర్.. ఆహ్వానించేందుకు మాత్రం కాదు.. ఎందుకంటే?
By: Tupaki Desk | 2 July 2022 6:05 AM GMTదేశాన్ని పాలిస్తున్న ప్రధాని రాష్ట్రానికి వస్తే ఖచ్చితంగా ఎంత పాత పగలు ఉన్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానించాలి. కానీ బీజేపీ అన్నా.. మోడీ అన్నా ఒంటికాలిపై లేస్తున్న కేసీఆర్ మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా వైరం పెంచుకుంటున్నారు. ఇదివరకూ మోడీ వస్తున్నాడని.. కర్ణాటక పర్యటన పెట్టుకొని అక్కడి నేతలను కలిశాడు కేసీఆర్. ఇలాంటి ప్రొటోకాల్ యవ్వరాలను తాను పట్టించుకోనని స్పష్టం చేశాడు. ఇప్పుడు ప్రధాని మోడీ మరోసారి నేడు రాష్ట్రానికి వస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాలుపంచుకునేందుకు ఈరోజే హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నారు.
ముఖ్యంగా వచ్చే ఏడాది జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, మాజీ సీఎంలు హాజరవుతున్నారు. మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభ జరుగనుంది. వీటి విజయవంతానికి బీజేపీ నేతలు చురుకుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మరోవైపు ఎలాగైనా సరే బీజేపీ సభలు, సమావేశాలకు ప్రజల్లో మైలేజ్ రాకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. రకరకాల ఎత్తులు వేస్తోంది. మీడియాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి బీజేపీకి స్కోప్ లేకుండా చేస్తోంది. హైదరాబాద్ లో హోర్డింగ్ లన్నింటిని టీఆర్ఎస్ పథకాలతో నింపేసింది. పోటీపోటీగా సాగుతున్న ఈఫైట్ వేళ కేసీఆర్ , మోడీ ఒకచోట కలుసుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మోడీ హైదరాబాద్ కు వస్తున్న రోజే.. నగరంలో భారీ ర్యాలీని టీఆర్ఎస్ తలపెట్టింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేసింది. బేగంపేట ఎయిర్ నుంచి జలవిహార్ కు భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. ర్యాలీ అనంతరం సీఎం కేసీఆర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో యశ్వంత్ సిన్హా భోజనం చేసి సమావేశం అవుతారు.
ఈరోజే ప్రధాని నరేంద్రమోడీ, యశ్వంత్ సిన్హాలు బేగంపేట ఎయిర్ పోర్టుకు రానున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా బేగంపేట ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు.కానీ ఆయన ఆహ్వానించేది ప్రధాని మోడీని కాదు. ఆయన కోసం వెళ్లలేదు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఆహ్వానించేందుకు కేసీఆర్ స్వయంగా వెళ్లారు.
ఇక మోడీని ఆహ్వానించేందుకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం తరుపున పంపారు. ఆయన మోడీని రిసీవ్ చేసుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం కేసీఆర్ వెళ్లాల్సి ఉన్నా టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య ఉప్పునిప్పులా ఉన్న వ్యవహారంతో మోడీని పట్టించుకోకుండా యశ్వంత్ సిన్హా కోసం కేసీఆర్ బేగంపేటకు వెళ్లి పోటాపోటీ రాజకీయానికి తెరతీశారు.