Begin typing your search above and press return to search.
సొంత నేతలనూ వదలని మోడీ
By: Tupaki Desk | 29 Nov 2016 6:53 AM GMTపెద్ద నోట్ల రద్దుతో సంచలనం సృష్టించిన ప్రధాని మోడీ ఇప్పుడు సొంత పార్టీకి చెందిన నేతలు - ప్రజాప్రతినిధులనూ వదలడం లేదు. ఎమ్మెల్యేలైనా - ఎంపీలైనా - స్థానిక నేతలైనా ఎవరైనా సరే బీజేపీ నేతలంతా తమ బ్యాంకు ఖాతాల సమాచారాన్ని పార్టీకి ఇవ్వాలని నియమం పెట్టారు. దీంతో అధికార పార్టీ నేతలంతా ఇప్పుడు టెన్షన్ కు గురవుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కాయకల్ప చికిత్స చేసేందుకు తలపెట్టిన కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ తమ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆందోళన చెందుతున్నారు.
బీజేపీ ప్రజాప్రతినిధులు బ్యాంకుల ఖాతాల వివరాలు వెల్లడించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధికారికంగా ఆదేశాలు జారీచేశారు. బీజేపీ ఎంపీలు - ఎమ్మెల్యేలు ఖాతాల వివరాలు వెంటనే వెల్లడించాలని సూచించారు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు జరిగే లావాదేవీల వివరాలన్నీ వెల్లడించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
బీజేపీ నేతల్లోనూ చాలామంది పెట్టుబడిదారులు - వ్యాపారులు - పారిశ్రామికవేత్తలు ఉండడంతో వారంతా ఇప్పుడు ఏం చేయాలా అన్న ఆలోచనలో పడ్డారు. మోడీ నల్ల కుబేరులనే కాకుండా తమనూ వెంటాడితే ఏం చేయాలన్న భయం వారిని వెంటాడుతోంది. రాజకీయాల్లో మెంటైన్ కావాలంటే ఆర్థికంగా బలంగా ఉండాల్సి ఉంటుందని... అందుకు వ్యాపారాలు - దందాలు తప్పవని పలువురు బాహాటంగానే అంటున్నారు. ఇప్పుడు తమ ఖాతాల సమాచారం ఇస్తే వ్యవహారాలన్నీ బట్టబయలై ఏం కొంపలు మునుగుతాయో అని టెన్షన్ పడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/