Begin typing your search above and press return to search.

మెరుపు దాడుల వేళ.. మోడీ ఎక్క‌డున్నారంటే?

By:  Tupaki Desk   |   26 Feb 2019 9:31 AM GMT
మెరుపు దాడుల వేళ.. మోడీ ఎక్క‌డున్నారంటే?
X
ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజల తరుఫున ప్రతీకారం తీర్చుకున్నారు. అమర జవాన్ల మృతికి సంతాపం తెలిపిన ఆయన దేశ ప్రజల ఆకాంక్షలను వైమానిక దాడులతో ఈరోజు నెరవేర్చారు. ప్రధాని ఆదేశాల మేరకు సోమవారం అర్ధరాత్రి దాటాక భారత వాయుసేనకు చెందిన 12 యుద్ధ విమానాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి ప్రవేశించి మెరుపు దాడి చేశాయి. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సర్జికల్ స్ట్రైక్ ను కేవలం 21 నిమిషాల్లో బాంబుల వర్షం కురిపించి సుమారు 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

కాగా జవాన్ల మరణం నుంచి రగిలిపోతున్న ప్రధాని నరేంద్రమోడీ.. ఈ దాడులను స్వయంగా పర్యవేక్షించినట్టు సమాచారం. జైషే ఉగ్రవాదుల స్థావరాలపై మన యుద్ధ విమానాలు బాంబులతో విరుచుకుపడుతున్న వేళ మోడీ వైమానిక కంట్రోల్ రూమ్ లోనే ఉన్నట్టు సమాచారం. భారత యుద్ధ విమానాలు పని పూర్తి చేసుకొని సురక్షితంగా తిరిగి భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత ఆయన కంట్రోల్ రూమ్ నుంచి బయటకు వచ్చినట్టు పర్యవేక్షించిన ఓ అధికారి వెల్లడించారు. దీన్ని బట్టి ప్రధాని మోడీ ఎంత కసిగా ఈ ఆపరేషన్ లో పాలుపంచుకున్నారో అర్థమవుతోంది.

కాగా పాకిస్తాన్ భూభాగంపై దాడుల చేసిన వైనాన్ని భారత్ ఐక్యరాజ్యసమితి లోని శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా లకు తెలిపింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని వైమానిక దాడులతో అరికట్టామని వివరించింది.