Begin typing your search above and press return to search.
వెంకయ్య వల్లే బాబును దూరం పెడ్తున్న మోడీ!
By: Tupaki Desk | 25 April 2016 11:33 AM GMTప్రధాని మోడీకి - ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య దూరం పెరుగుతుందా? ఇద్దరి మధ్య అంతరం అంతకంతకూ విస్తరిస్తుందా? చంద్రబాబు తీరుపై ప్రధాని ఆగ్రహంతో ఉన్నారా? ఇందులో వెంకయ్యనాయుడు పాత్ర కూడా ఉందా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ప్రధానితో భేటీ అంటే గంట ముందు ఆయన కార్యాలయంలో ఉండే చంద్రబాబు.. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకున్నా మోడీని అమాంతం ఆకాశానికి ఎత్తే బాబుని... సభలల్లో, ప్రత్యేకంగా కలిసినా పెద్దగా పలకరింపుల్లేకుండా... ఉండటంలాంటివి మోడీకి.. బాబుకు మధ్య దూరాన్ని తేటతెల్లం చేస్తోందని అంటున్నారు.
ఏపీ సీఎం వైఖరి వల్లే కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆలస్యం అవుతుందన్న అభిప్రాయం ఇటీవల కాలంలో వినిపిస్తోంది. చట్టప్రకారం కొత్త రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన నిధులు విదిల్చడంలో మోడీ మీనమేషాలు లెక్కిస్తున్నారనీ, అందుకే అభివృద్ధి అనుకున్నంత వేగంగా జరగట్లేదని బాబు నోరుజారి మోడీ మనసును నొప్పిచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు పలుమార్లు ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు మోడీని నేరుగా కలవకుండా సంబంధిత మంత్రులను కలిసి రావటం కూడా ఒక కారణంగా చెప్పుకుంటున్నారు. ఇవన్ని చూస్తుంటే. మిత్రుల మధ్య లెక్కల్లో ఎక్కడో తేడానే వచ్చినట్లే కనిపిస్తోందంటారు రాజకీయ విశ్లేషకులు.
వీరిద్దరి మధ్య తేడాతో పాటు... వెంకయ్యనాయుడిని కూడా మోడీ పెద్దగా పట్టించుకోవట్లేదనీ, ఆయన మాటల్ని ఎక్కవగా పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించట్లేదన్న టాక్ కూడా ఉంది. నిజానికి వెంకయ్యకు చంద్రబాబును మంచి సాన్నిహిత్యం ఉంది. మోడీతో బాబు నేరుగా మాట్లాడుకుండా వెంకయ్యతో చెప్పిస్తున్నారనీ, దీంతో వెంకయ్య చంద్రబాబు పని తనం గురించి మరీ ఎక్కువగా పొగడటం కూడా మోడీ అసహనానికి కారణమంటున్నారు. ప్రతీసారి బాబు గురించి ఉన్నదానికంటే కాస్త ఎక్కువ చెబుతున్నారనీ వెంకయ్యను కూడా పక్కన పెట్టారన్న గుసగుసలు వినబడుతున్నాయ్.
నవ్యాంధ్ర అభివృద్ధికి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని మాట మాత్రమైనా చెప్పకుండా బాబు డాబూ దర్పం చూపిస్తూ... తమను చిన్న చూపు చూస్తున్నారని కమలనాథులు కస్సుమంటున్నారు. అయితే ఈ దూరం... ఎంతదూరం వెళ్తుందన్నదే అసలు ప్రశ్న. పొలిటికల్ సర్కిల్ లో దీనిపై ఉహాగానాలు ఊపందుకుంటే... అంచనాలు అదరిపోయే సమాధానాలిస్తున్నాయ్. ఒకప్పుడు హైదరాబాద్ లో ఉండి ఢిల్లీలో చక్రం తిప్పిన బాబులాంటి నాయకుడిని, మోడీ అంతగా పట్టించుకోకుండా ఉంటున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఏపీలో అభివృద్ధి అనేది కేంద్రంతో సంబంధం లేకుండా జరుగుతున్నట్టుగా బాబు వ్యవహరిస్తున్నారనీ, అందుకే మోడీ పెద్దగా ఏపీ విషయంలో జోక్యం చేసుకోలేకపోతున్నారన్న టాక్ ఉంది.