Begin typing your search above and press return to search.

సంచ‌ల‌న నిర్ణ‌యం.. 500-1000 నోట్లు ర‌ద్దు

By:  Tupaki Desk   |   8 Nov 2016 3:17 PM GMT
సంచ‌ల‌న నిర్ణ‌యం.. 500-1000 నోట్లు ర‌ద్దు
X
ఎన్డీయే స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ మీద అసాధార‌ణ ప్ర‌భావం చూపించే నిర్ణ‌యాన్ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించారు. దేశంలో 500.. 1000 రూపాయ‌ల నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ అర్ధ‌రాత్రి నుంచే ఈ నిర్ణ‌యం అమ‌ల్లోకి రాబోతుండ‌టం గ‌మ‌నార్హం. మంగ‌ళ‌వారం రాత్రి జాతినుద్దేశించి ప్ర‌సంగిస్తూ మోడీ ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. దేశ ఆర్థిక చ‌రిత్ర‌లోనే ఈ నిర్ణ‌యం అత్యంత ప్ర‌భావం చూపించేదిగా భావిస్తున్నారు. ఐతే 500.. 1000 నోట్ల‌ను బ్యాంకుల్లో మార్చుకోవ‌డానికి డిసెంబ‌రు 31 వ‌ర‌కు గ‌డువు ఇచ్చారు.

దేశంలో బ్లాక్ మ‌నీకి.. ఫేక్ నోట్ల‌కు అడ్డు క‌ట్ట వేసే దిశ‌గా ఇది గొప్ప నిర్ణ‌య‌మ‌ని భావిస్తున్నారు. ‘‘నల్లధనం - అవినీతి కబంధ హస్తాల్లో దేశం చిక్కుకుపోయింది. అధికార దుర్వినియోగంతో అనేకమంది భారీ సంపద కూడగట్టారు..నిజాయతీ పరులు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సాధారణ పౌరుడు అత్యంత నిజాయితీతో జీవిస్తున్నాడు.. అధికారం అనుపానులు తెలిసినవాళ్లే అవినీతికి పాల్పడతున్నారు. ఉగ్రవాద సంస్థలు రూ.500 - రూ.1000 దొంగనోట్లను చెలామణి చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి. అవినీతిపరుల ఆటకట్టించేందుకు బినామీ ఆస్తుల చట్టాన్ని తీసుకొచ్చాం’’ అని త‌న ప్ర‌సంగంలో ప్ర‌ధాని మోదీ వివరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/