Begin typing your search above and press return to search.
ఈసీకే దిమ్మ తిరిగేలా చేసిన మోడీ బయోపిక్?
By: Tupaki Desk | 25 April 2019 5:14 AM GMTఅసలే మోడీ. అందులో ఆయన బయోపిక్. అది కూడా కీలకమైన ఎన్నికల వేళ విడుదల చేయాలన్న లక్ష్యం ఉంటే.. ఆ సినిమాలో ఏముంటుందో? ప‌్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. మోడీని ఒక రేంజ్లో కీర్తించటమే కాదు.. భారతీయుల అదృష్టం బాగుండి.. ఆ దేవుడు ప్రత్యేకంగా పంపిన అరుదైన పీస్ అన్నట్లు మోడీ బయోపిక్ ఉండటం ఖాయం. అంతేనా.. మోడీ అనే వ్యక్తే లేకుంటే భారత పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదన్న సందేహం కలిగేలా ఈ మూవీ ఉంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.
మోడీ బయోపిక్ రిలీజ్ పైన అభ్యంతరం వ్యక్తం చేసే వారు సుప్రీంను ఆశ్రయించటం తెలిసిందే. ఈ సినిమాను విడుదల చేయాలా? వద్దా? అన్న విషయాన్ని ఎన్నికల సంఘం సభ్యులు సినిమాను చూసి డిసైడ్ చేయాలని కోర్టు కోరింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను చూసిన ఈసీకి దిమ్మ తిరిగిపోయే షాక్ కలిగినట్లు చెబుతున్నారు.
మోడీ బయోపిక్ ఎలా ఉందన్న విషయాన్ని సుప్రీంకు చెప్పిన ఈసీ.. కీలక వ్యాఖ్య చేసింది. నరేంద్ర మోడీ మీద తీసిన సినిమా.. ఒక జీవిత కథను మించి మహాత్ముడి చరిత్రలా ఉందని ఈసీ వ్యాఖ్యానించటం గమనార్హం. మోడీ వ్యక్తిత్వాన్ని చాలా ఎక్కువగా కీర్తిస్తూ ఈ సినిమాను తీసినట్లుగా తేల్చింది.
ఎన్నికల మీద ప్రభావం చూపేలా ఉన్న మోడీ బయోపిక్ ను ఆఖరి పోలింగ్ దశ పూర్తి అయ్యే వరకూ విడుదల చేయటం ఏ మాత్రం సరికాదంటూ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది. ప్రధాని వ్యవహారం అన్నప్పుడు ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తుందన్న పేరున్న ఈసీ సైతం.. సినిమా రిలీజ్ వద్దంటూ నిర్మోహమాటంగా తేల్చి చెప్పటం అంటే.. సినిమాలో భజన ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదేమో.