Begin typing your search above and press return to search.
మోడీ మాటకు కేజ్రీ మురిసిపోయారు
By: Tupaki Desk | 16 Aug 2016 1:49 PM GMTఉప్పు.. నిప్పు ఒక్కచోట చేరితే చిటపటలతో మోత మోగిపోతుంటుంది. కానీ.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఇప్పుడు వార్తాంశంగా మారింది. మోడీ మాట ఎత్తితే చాలు.. అంతెత్తు ఎగిరిపడే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ రోజు ప్రధానికి థ్యాంక్స్ చెబితే.. మరోవైపు మోడీ.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఆరోగ్యంతో కలకాలం ఉండాలంటూ దేవుడ్ని ప్రార్థించారు.
ప్రధానమంత్రి తనను చంపాలని చూస్తున్నట్లుగా మొన్నటికి మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి నానా యాగీ చేసి.. మీడియాలో ప్రముఖంగా దర్శనమిచ్చారు. ఒక ప్రధాని మీద ఈ మధ్య కాలంలో ఒక ముఖ్యమంత్రి ఇంతటి తీవ్ర ఆరోపణలు చేసింది లేదు. తనను అంత మాట అన్న ఢిల్లీ ముఖ్యమంత్రి మీద గుస్సా కానీ ప్రధాని మోడీ.. ఈ రోజు కేజ్రీవాల్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ లో బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన.. దీర్ఘ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని తాను ప్రార్థిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు.
మోడీ చేసిన బర్త్ డే విషెస్ తో మురిసిపోయిన కేజ్రీవాల్ ఆయనకు థ్యాంక్స్ చెబుతూ మరో ట్వీట్ చేశారు. వీరిద్దరి ట్వీట్స్ పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభించింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరన్న విషయాన్ని ఇద్దరూ మరోసారినిరూపించారని పేర్కొన్నారు. అయితే.. ఇక్కడ మర్చిపోకూడని అంశం ఏమిటంటే.. ప్రముఖుల పుట్టిన రోజు సందర్భంగా అందరికి పుట్టినరోజు శుభాకాంక్షలు మోడీ చెప్పటం ఖాయమే. ప్రధాని లాంటి వ్యక్తి బర్త్ డే విషెస్ చెప్పినప్పుడు.. వినయంగా థ్యాంక్స్ చెప్పకుంటే కేజ్రీని తిట్టిపోస్తారు. అందుకే.. ఆయన కూడా మోడీ ట్వీట్ కు థ్యాంక్స్ చెప్పారని చెప్పాలి. అంతకు మించి ఇద్దరి మధ్య వైరం తగ్గిందనుకుంటే భ్రమే. ఉప్పు నిప్పు మండిపోకుండా బర్త్ డే అడ్డు పడిందని మాత్రమే అనుకోవాలి.