Begin typing your search above and press return to search.
హిమాచల్ ఎన్నికల్లో మోడీ బ్లాక్‌మెయిల్: కాంగ్రెస్ సంచలన కామెంట్
By: Tupaki Desk | 8 Nov 2022 1:30 AM GMTహిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ రగడ తారస్థాయికి చేరింది. ఈ ఎన్నికల్లో ఓ అభ్యర్థిని పోటీ చేయనివ్వకుండా ప్రధాని మోడీ ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న ఓ వీడియోను ఆయన పోస్టు చేశారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపికి చెందిన ఓ తిరుగుబాటు అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలంటూ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒత్తిడి తెచ్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తద్వారా ప్రధాని తన అధికారాన్ని ఉపయోగించి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని విమర్శించింది.
దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారంలో ఉన్న ఓ వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి ప్రస్తావించారు.
కంగ్రా జిల్లాలోని ఫతేపుర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయవద్దంటూ ఓ నేతను మోడీ ఫోనులో మానసికంగా బెదిరిస్తున్నారని తెలిపారు.
"పరిపాలన కంటే బీజేపీ ప్రభుత్వానికి, దాని ముఖ్యనిర్వహణాధికారికి(పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశించి) ఎన్నికల ప్రచారం ఇష్టమైన కార్యక్రమంగా ఉంది" అని సింఘ్వి పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో తమ ప్రాబల్యం కోల్పోతోందని తెలుసుకున్న బీజేపీ అభద్రతాభావంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. "గౌరవనీయులైన ప్రధాని కార్యాలయం .. ఒక ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఇలాంటి స్థాయికి దిగజారుతుందా? దీనిపై తీర్పు చెప్పే బాధ్యతను దేశానికి వదిలివేస్తాము" అని ఆయన పేర్కొన్నారు. మరి దీనిపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.