Begin typing your search above and press return to search.
రైతు అజెండాతో క్యాబినెట్ మీటింగ్
By: Tupaki Desk | 28 Jan 2019 6:54 AM GMTఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీకి తత్వం బోధపడినట్టుంది. ఇన్నిరోజులు ఎవరినైతే నిర్లక్ష్యం చేశామో వారిని ఆకట్టుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అన్నదాతలేననే సర్వేలు చెబుతున్నారు. దీంతో మోడీ రైతులపై ఫోకప్ పెట్టారు.
మరో నెలరోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుండటంతో రైతుల శ్రేయస్సుకు సంబంధించిన కీలక నిర్ణయాలను నేడు నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో తీసుకోనున్నారని సమాచారం. రైతులకు ప్రకటించే ప్యాకేజీలపై ఇప్పటికే వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు రూపొందించిది. వీటిపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రైతులను ఆకట్టుకునేందుకు కేంద్రం ప్రధానంగా మూడు తాయిలాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నిర్ణీత గడువులోగా రైతులు తీసుకున్న పంట రుణాలకు వడ్డీ చెల్లిస్తే పూర్తిగా మాఫీ చేయడం ఒకటి. దీని ద్వరా ప్రభుత్వంపై రూ.15వేల కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఆహార ధాన్యాల పంటలపై ప్రస్తుతం రైతులు చెల్లిస్తున్న బీమీ ప్రిమియాన్ని పూర్తిగా మాఫీ చేయడం రెండోది. ఇక మూడోది తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు తరహా మాదిరిగానే రైతు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడం వంటి వాటిపై కేంద్రం దృష్టిసారించింది.
అదేవిధంగా ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో భారీగా వ్యవసాయ ప్యాకేజీలు అమలు చేయనున్నట్లు ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ సంకేతాలిచ్చారు. వీటి ద్వారా రైతుల్లో బీజేపీపై ఉన్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తోంది. రైతులకు వరాలు ప్రకటించి తద్వారా గంపగుత్తగా రైతుల ఓట్లు కొట్టేగొట్టే యత్నం చేస్తుంది. ఏదిఏమైనా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీలో కొంత మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చే తాయిలాలకు రైతన్న ఆకర్షితుడవుతాడా లేదా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఒకవేళ బీజేపీపై రైతన్న కన్నెర్ర చేస్తే మాత్రం ఆ పార్టీకి అధికారం దూరమవడం ఖాయంగా కనిపిస్తుంది. మరీ కేంద్ర ప్రభుత్వం తన క్యాబినెట్ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరీ.