Begin typing your search above and press return to search.
సీనియర్ మంత్రులకు సైతం దిమ్మ తిరిగిపోయిందట
By: Tupaki Desk | 9 Nov 2016 3:38 PM GMTనిన్నటి పరిణామాలపై మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చాలా న్యూస్ ఛానళ్లకు చెందిన ప్రముఖులకు నిన్నటి పరిణామాలు ఒకింత ఆసక్తి కలిగించటమే కాదు.. అసలేం జరిగిందన్నవిషయంపై ఆరా తీసే ఉత్సాహాన్ని ప్రదర్శించారు. తమకున్న అన్ని సోర్సుల నుంచి నిన్నటి కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఏం జరిగింది? పెద్ద నోట్లపై ప్రధాని మోడీ ప్రకటన తర్వాత వారి ఫీలింగ్ ఏమిటి? వారికీ విషయం ఎప్పుడు తెలిసింది? లాంటి వాటిని ఆరా తీసినప్పుడు ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయని చెప్పాలి.
పెద్దనోట్లు చెల్లవంటూ దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ.. దానికి కొద్దిసేపటి ముందు కేంద్రమంత్రి వర్గ సమావేశాన్నినిర్వహించారు. ఈ సమావేశంలో మోడీ తాను ప్రకటించనున్న సంచలన విషయాన్ని మాట వరసకైనా వెల్లడించలేదు. దేశ ప్రజలకు సమాచారం అందించిన తర్వాత.. సీనియర్ మంత్రుల్ని పిలిపించుకున్న ఆయన.. తాను తీసుకున్న నిర్ణయాన్ని.. దాని వల్ల కలిగే ప్రయోజనాల్ని వివరించారట.
అప్పటికే షాక్ లో ఉన్న వారు ప్రధాని మోడీ మాటల్ని విన్నారట. తమ లాంటి సీనియర్ నేతల్ని సైతం మోడీ విశ్వాసంలోకి తీసుకోకపోవటం కొందరు ఫీల్ అయినప్పటికీ.. మోడీ లాంటి నేత ముందు తమ పప్పులు ఉడకవన్న విషయాన్ని అర్థమై కామ్ గా ఉండిపోయారు. కాకుంటే.. సన్నిహితుల వద్ద మాత్రం ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఏమైనా సొంత జట్టుసభ్యులకు సైతం సమాచారం అందించని మోడీ.. తన నిర్ణయాన్ని మొదట దేశ ప్రజలకే చెప్పటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/