Begin typing your search above and press return to search.
పార్లమెంటులో అడ్డంగా దొరికిన మోడీ
By: Tupaki Desk | 27 Nov 2015 10:44 AM GMTప్రధానమంత్రి నరేంద్రమోడీ పార్లమెంటు వేదికగా అడ్డంగా దొరికిపోయారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా మొదటిరోజు రాజ్యాంగంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో అసహనం పెరిగిపోవడం, అంబేద్కర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరోవైపు ఇదే సమయంలో సింగపూర్ - మలేషియా దేశాలతో ఒప్పందాల గురించి ప్రధానమంత్రి బిజీబిజీగా గడిపారు. అయితే ఇదే క్రమంలో మొదటి రోజే సభలో మోడీ ఇబ్బందికరంగా మారింది.
రాజ్యంగ రూపకర్త అంబేద్కర్ గురించి వివరించిన అనంతరం మోడీ తన సీటులో కూర్చుండిపోయారు. ఈ క్రమంలోనే పార్లమెంటు టీవీ కెమెరాలు ఆయనవైపు తిప్పాయి. ఈ క్రమంలో మోడీ నిద్రలోకి జారుకున్న భంగిమలో ఉండటం కెమెరాలు ద్వారా ప్రసారం అయింది. ఇలా కొద్దిసమయం ప్రసారం కావడంతో ఒక్కసారిగా అంతా ఆశ్చర్య పోయారు. పార్లమెంటులో ఇంత హాట్ హాట్ గా చర్చ సాగుతున్న సమయంలో ప్రధానమంత్రి సభలో నిద్రిస్తున్న మూడ్ లోకి వెళ్లిపోవడం విస్మయం కలిగించింది. వెనువెంటనే దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి.
#PMJetLag started off పేరుతో హ్యాష్ టాగ్ ఏర్పాటుచేసి దీనిపై తమదైన శైలిలో చెణుకులు విసిరారు. పార్లమెంటు కన్నా మోడీకి నిద్రే మిన్నా అని ఒకరు స్పందించగా, త్వరలో ఏ దేశంలో పర్యటించాలా అని మోడీ దీర్ఘాలోచనలో పడ్డారు అంటూ మరొకరు స్పందించారు. త్వరలో జరగబోయే ప్రయాణాల కోసం కొత్త ఉత్సాహాన్ని సంపాదించుకున్నారంటూ మరికొందరు పంచ్‌లు పేల్చారు. మొత్తంగా అనేకమంది తమదైన శైలిలో స్పందించారు. అయితే బీజేపీ నేతలు మాత్రం దీన్ని ఖండించారు. ముఖ్యమైన పత్రాలను శ్రద్ధగా చూసుకోవడంలో మోడీ నిమగ్నమై ఉంటే...దాన్ని చిలువలు పలువలుగా మార్చారని మండిపడ్డారు.