Begin typing your search above and press return to search.
దీపావళి వేడుకల్లో మోడీ మార్క్ సంబరాలు
By: Tupaki Desk | 31 Oct 2016 3:30 AM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో రేడియో ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి దేశ ప్రజలందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దివాళి పండుగను జవాన్లకు అంకితమిద్దామని తెలిపారు. దేశాన్ని రక్షించే జవాన్లకు మద్దతుగా నిలిచే ప్రజలకు మోడీ ధన్యావాదాలు తెలిపారు. జవాన్ల సంక్షేమం కోసం పాటుపడదామన్నారు. అనంతరం ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నూర్ జిల్లాలోని ఐటీబీపీ జవాన్లను వద్దకు వెళ్లి అక్కడ సంబురాలు చేసుకున్నారు. సైనిక సిబ్బంది మోడీకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ సైనికులకు మిఠాయిలు తినిపించారు.
పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత ప్రధాన మంత్రి సైనికులను నేరుగా వారి కార్యక్షేత్రంలో కలుసుకోవడం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైనికులతో మాట్లాడుతూ కుటుంబంతో పండగ జరుపుకోవాలని అందరూ అనుకుంటారని అయితే జవాన్లకు మద్దతుగా దీపావళి వేడుక కోసం నేను మీ దగ్గరకు వచ్చానని పేర్కొన్నారు. కీలక సమయాల్లో మన జవాన్లు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుండగా వారికి అండగా ఉండేందుకు సినీనటులు - క్రీడాకారులు సహా అంతా నిలుస్తున్నారని సైనికులతో మోడీ అన్నారు. 2001లో గుజరాత్ భూకంప బాధితులతో దీపావళి వేడుకలు జరుపుకొన్నానని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయితే దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్లతో ప్రధానమంత్రి మోడీ దీపావళి సంబరాలు జరుపుకోవడం తొలిసారి కాదు. గత రెండు దీపావళి వేడుకలను ఆయన సైనికులతోనే జరుపుకొన్నారు. కాగా...ఈ సందర్భంగా జవాన్లతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను ‘జై జవాన్.. జై హింద్’.. అంటూ ట్విట్టర్ ద్వారా మోడీ పోస్ట్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/