Begin typing your search above and press return to search.

ఒక్క ఓటమి.. మోడీ లో ఎంత మార్పు తెచ్చిందా?

By:  Tupaki Desk   |   2 Jan 2020 9:08 AM GMT
ఒక్క ఓటమి.. మోడీ లో ఎంత మార్పు తెచ్చిందా?
X
దేశాన్ని ఏకచ్చత్రాధిపత్యంతో ఏలిన ఆసామి ఆయన.. ఒంటిచెత్తో బీజేపీని గెలిపించడంతో ఆయన రూలర్ అయిపోయారు. బీజేపీ కురువృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి సహా అందరికీ రిటైర్ ఇచ్చేశారు. దేశంలోనే పవర్ ఫుల్ నేతగా నరేంద్రమోడీ తన మాటేశాసనంలా శివగామి టైపులో చెలరేగిపోయారు.

దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తాజాగా వివాదాస్పద నిర్ణయాల తో వ్యతిరేకత తెచ్చుకుంది. పౌరసత్వ చట్టం, ఎన్నార్సీ, అయోధ్య సహా వివాదాస్పద అంశాల్లో హిందుత్వ స్టాండ్ తీసుకుంది. దీంతో అఖండ మెజార్టీ తో గెలిపించిన ఓటర్లే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. దేశంలోని రాష్ట్రాలన్నీ ఒక్కటొక్కటి గా చేజారి పోతుంటే కానీ మన మోడీ గారికి ఇప్పుటికీ పాత మిత్రులు గుర్తుకువస్తున్నారు.

ఇప్పటికే మహారాష్ట్ర లో శివసేన హ్యాండించింది. ఇక కేంద్రంలో 303 ఎంపీ సీట్లు వచ్చాయని విర్రవీగి మిత్రపక్షం జేడీయూకు కేంద్రమంత్రి పదవులు కూడా ఇవ్వకుండా నాడు మోడీ బీరాలకు పోయాడు. కానీ ఇప్పుడు ఎన్డీఏ లో బీజేపీ తోపాటు మిగిలిన ఏకైక మిత్రపక్షం జేడీయూనే.. అందుకే బీహార్ ఎన్నికల వేళ నితీష్ ను అయినా జారిపోకుండా కాపాడుకునే ప్రయత్నాలకు మోడీ తెరతీశారట..

నాడు నితీష్ కోరినా రెండు కేంద్ర మంత్రులివ్వని మోడీ.. నేడు వాటిని ఇస్తానంటూ కబురు పంపారట.. బీహార్ లో ఎన్నికలకు వేళ కావడంతో మోడీ ఈ పాచిక విసిరారట.. బీహార్ లో ఒంటరిగా పోటీచేస్తే బీజేపీ బాక్స్ బద్దలై ఓటమి ఖాయం. అందుకే నితీష్ ను నమ్ముకొని ఆయనను దువ్వే పనిలో బీజేపీ పడిందట..

ఇటీవల నితీష్ సైతం కేంద్రానికి షాకిచ్చారు. బీహార్ లో ఎన్సార్సీ చెల్లదని నితీష్ స్పష్టం చేశారు. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ అదే బీజేపీ కి వ్యతిరేకం గా నిర్ణయం తీసుకున్నారు. ఈసారి నితీష్ కూడా వదిలేస్తే బీజేపీ కి మరో రాష్ట్రం బొక్కా.. అందుకే ఆయనను మచ్చిక చేసుకునేందుకు కమలనాథులు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారట..

ఇలా కేంద్రంలో ఫుల్ మెజారిటీ తో రెచ్చిపోయిన మోడీ గారు రాష్ట్రాల్లో వరుస ఓటముల తో కానీ దిగిరాలేదని రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు.